Saturday, April 26, 2025
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: ఆపరేషన్ థియేటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీదేవి

Pathikonda: ఆపరేషన్ థియేటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీదేవి

పత్తికొండ నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేకపోవడంతో నియోజకవర్గ మహిళలు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ డాక్టర్ లేరని ఆలూరులో పనిచేస్తున్న గైనకాలజిస్ట్ డాక్టర్ కల్పనను పత్తికొండకు రెగ్యులర్ వైద్యురాలిగా బదిలీ చేయించారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిమ్మ చేతుల మీదుగా ఆపరేషన్ థియేటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కల్పన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఉన్న మహిళలకు కుటుంబా నియంత్రణ ఆపరేషన్ వారానికి ఒకసారి చేస్తామని అన్నారు.ఆపరేషన్ కు కావలసిన పరికరాలు అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. కొన్ని పరికరాలు ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఇక్కడే ఉచితంగా డెలివరీలు కూడా చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నారాయణ దాసు,మండల కో ఆప్షన్ నెంబర్ కారుమంచి నజీర్, ఎంపీటీసీ నీలకంఠ,హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News