Friday, November 22, 2024
HomeతెలంగాణSathupalli: నాగలి పట్టి, దుక్కి, దున్ని ఏరువాక ప్రారంభించిన సండ్ర

Sathupalli: నాగలి పట్టి, దుక్కి, దున్ని ఏరువాక ప్రారంభించిన సండ్ర

రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సండ్ర

పెనుబల్లి మండలం, లింగగూడెం గ్రామంలో ఎద్దుకు పూజ చేసి నాగ‌లితో పొలం దున్నారు. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ఏరువాక పున్నమి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమ నాడు రైతులందరూ ఈ పండుగను జరుపుకుంటారని, ఏరు అంటే ఎడ్లను కట్టి దున్నడానికి సిద్ధపరచిన నాగలి, ‘ఏరువాక’ అంటే దుక్కి ప్రారంభ దినం అని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయానికి సిద్ధంగా ఉంచే ఒక గొప్ప పండుగ ఏరువాక పౌర్ణమి అని ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయం రైతులకు పండుగగా మారాలని ఆకాంక్షించారు. పొలంలో దుక్కి దున్నడంతో ప్రారంభించి, వ్యవసాయ పనులను ప్రారంభించన ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ అన్నదాతలు ఈ ఏరువాక పూర్ణిమ పర్వదినాన ఎడ్లు, నాగలి, ఇతర వ్యవసాయ పనిముట్లను పూలు, పసుపు, కుంకుమ, ధూప దీపాలు మొదలైనవాటితో పూజించి, దుక్కి దున్నడంతో ప్రారంభమైన వ్యవసాయ పనులు, ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి పంటలు పండాలని భగవంతుని కోరుకుంటూ, ఈ ఏరువాక పౌర్ణమి రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News