Friday, November 22, 2024
HomeతెలంగాణKautalam: జగనన్న 'విద్యా కానుక' కిట్ల పంపిణీ

Kautalam: జగనన్న ‘విద్యా కానుక’ కిట్ల పంపిణీ

విద్యా కానుక కిట్లలో 3 జతల బట్టలు,టెక్స్ట్ బుక్ స్కూల్ బ్యాగ్స్, ఆక్స్ఫర్డ్ డికషనరీ,బెల్ట్ ఇత వస్తువులు

కౌతాళం మండలం నదిచాగి గ్రామ మండల పరిషత్ కన్నడ పాఠశాల, జిల్లా పరిషత్ కన్నడ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాలు మేరకు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్, అద్యక్షతన జరిగింది. 2023-24 విద్యా సంవత్సరం పాఠశాల ప్రారంభం అయిన మొదటి రోజే ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 227 విద్యార్థులకు, ఉన్నత పాఠశాలలో చదువుతున్న 270 విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జగనన్న విద్యా కానుక కిట్లలో 3 జతల బట్టలు, టెక్స్ట్ బుక్ స్కూల్ బ్యాగ్స్, ఆక్స్ఫర్డ్ డికషనరీ,బెల్ట్ ఇత వస్తువులను వరసగా 4వ సారి విద్యార్థులకు విద్యా సంవత్సర మొదటి రోజే అందించారు. గ్రామ నాయకులు రామన్న గౌడ మాట్లాడుతూ హై స్కూలును నాడు నేడు పథకం కింద దాదాపు 1.5 కోట్ల నిధులతో , ప్రైమరీ స్కూల్ ను సుమారు 20 లక్షల రూపాయలతో ప్రభుత్వం కార్పొరేట్ స్కూల్ బిన్నంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పాఠశాల గదులను మార్చి బెంచీలు,ఫ్యాన్లు, బ్లాక్ బోర్డులు, తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. ఉన్నత పాఠశాల పనులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ పంపాపతి గౌడ, ప్రాథమిక పాఠశాల ముఖ్యోపాధ్యాయులు గురురాజ శెట్టి, స్కూల్ చైర్మన్ ఈశప్ప గౌడ, ఎంపీటీసీ లింగన్న గౌడ, గ్రామ పెద్దల, అయా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News