Thursday, September 19, 2024
Homeహెల్త్Oily skin?: జిడ్డు చర్మానికి బూటీ టిప్స్

Oily skin?: జిడ్డు చర్మానికి బూటీ టిప్స్

జిడ్డు చర్మాన్ని తరచూ శుభ్రం చేసుకోవాలి

జిడ్డు చర్మంతో ఇబ్బంది పడతున్నారా? ఇందుకు కొన్ని బ్యూటీ చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే…
 జిడ్డు చర్మాన్ని తరచూ శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై అధికంగా స్రవించే నూనెపదార్థాలను నియంత్రించవచ్చు. చర్మం శుభ్రంగా ఉంటుంది. రోజుకు మూడుసార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న జిడ్డుదనం, మురికి పోతాయి. దాంతో యాక్నే, మొటిమలు వంటి సమస్యలు తలెత్తవు. ఆయిల్ లేని ఫేస్ వాష్స్ , క్లీన్సర్లు వాడాలి. జిడ్డు చర్మాన్ని శుభ్రం చేసేందుకు మెడికేటెడ్ సోప్స్ ను కూడా వాడొచ్చు. వీళ్లు సలిసిలిక్ యాసిడ్, టీ ట్రీ ఆయిల్, వేప, పసుపు, తేనె ఉన్న ఉత్పత్తులను వాడితే మంచిది.
 జిడ్డు చర్మం ఉన్నవాళ్లు స్క్రబ్బింగ్ తప్పకుండా చేసుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు తప్పనిసరిగా చర్మాన్ని ఎక్స్ ఫొయిలేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, యాక్నే, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటివి తలెత్తవు. చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు చర్మంపై పేరుకున్న మురికిపదార్థాలు పోతాయి. చర్మం మెరుపును సంతరించుకుంటుంది. చర్మం పగుళ్లకు గురికాదు. అందుకే స్కిన్ కేర్ రొటీన్ లో వీళ్లు తప్పనిసరిగా ఎక్స్ ఫొయిలేషన్ పాటించాలి.
అలాగే చర్మాన్ని మొరటుగా కాకుండా సున్నితంగా మర్దన చేయాలి.
 వారానికి ఒకసారి ఫేస్ మాస్కు చేసుకుంటే చర్మంపై మంచి ప్రభావం కనిపిస్తుంది. కొలిన్, బెంటోనైట్ క్లే, శాండల్ వుడ్, ముల్తానీమట్టి వంటి పదార్థాలు ఉన్న ఫేస్ మాస్కులు లేదా ఫేస్ ప్యాకులు వాడితే చర్మంలోని జిడ్డుదనం పోయి చర్మం కాంతివంతంగా, సున్నితంగా తయారవుతుంది.
 ఆల్కహాల్ లేని టోనర్లను నిత్యం వాడాలి. టోనింగ్ నిత్యం చేసుకోవడం వల్ల చర్మంలో చేరిన అధిక నూనె పదార్థాలు పోతాయి. మురికి పోతుంది. ఈ రకమైన చర్మ పరిరక్షణకు రోజ్ వాటర్ మంచి టోనర్ గా పనిచేస్తుంది.
 జిడ్డు చర్మం ఉన్నవాళ్లు నిత్యం మాయిశ్చరైజర్ ను తప్పనిసరిగా రాసుకోవాలి. మాయిశ్చరైజర్ రాసుకోకపోతేనే జిడ్డుదనం ఎక్కువవుతుంది. అందుకే నూనె లేని, వాటర్ బేస్డ్, నాన్ కొమెడోజెనిక్ మాయిశ్చరైజర్ ను వీళ్లు వాడాల్సి ఉంటుంది.
 జిడ్డుచర్మం ఉన్నవాళ్లు ముఖం మరింత జిడ్డుగా తయారవుతుందని సన్ స్క్రీన్ వాడడానికి సందేహిస్తుంటారు. కానీ వీళ్లు సన్ స్క్రీన్ ను తప్పనిసరిగా చర్మానికి రాసుకోవాలి. లేకపోతే సూర్యరశ్మి ప్రభావంతో చర్మంపై బ్రౌన్ స్పాట్స్, మొటిమలు, మచ్చలు వంటివి తలెత్తుతాయి. అందుకే ఈ తరహా చర్మం ఉన్నవాళ్లు జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ ను వాడాలి. లేదా ఆయిలీ స్కిన్ కు సరిపడే నాణ్యమైన సన్ స్క్రీన్ ను ఉపయోగించాలి. ఇవి ముఖం సూర్యరశ్మి బారిన పడకుండా రక్షిస్తాయి. ఈ రకమైన చర్మం ఉన్నవాళ్లు షుగరీ ఐటమ్స్, చిరుతిళ్లకు దూరంగా ఉండాలి. బాగా నీళ్లుతాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని కలుషిత పదార్థాలన్నీ బయటకు పోతాయి. నిత్యం ఏదో ఒక పండును తప్పనిసరిగా తినాలి.
పండుతో పాటు ఆకుకూరలు, కూరగాయలు మీ డైట్ లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News