Tuesday, May 21, 2024
HomeNewsAAA సినిమాస్ విషయంలో మహేష్ ను ఫాలో అయినా అల్లు అర్జున్..

AAA సినిమాస్ విషయంలో మహేష్ ను ఫాలో అయినా అల్లు అర్జున్..

చిత్రసీమ లో రాణిస్తున్న నటి నటులు ఓ పక్క వరుస సినిమాల్లో నటిస్తూ..కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ..ఆలా వచ్చిన డబ్బుతో ఇతర బిజినెస్ లు చేస్తుంటారు. అల్లు అర్జున్, మహేష్ బాబు , విజయ్ దేవరకొండ తో పాటు పలువురు హీరోలు , హీరోయిన్లు పలు బిజినెస్ లు చేస్తున్నారు. మహేష్ , విజయ్ దేవరకొండ లు ఏషియన్ సినిమాస్ తో కలిసి థియేటర్స్ నిర్మిస్తూ వస్తుండగా …తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తాజాగా అమీర్ పేట్ లో AAA సినిమాస్ పేరుతో భారీ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు.ఈ మల్టీప్లెక్స్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. అమీర్‌పేట్‌లో ఇంతకుముందు ఉన్న సత్యం థియేటర్‌ను పడగొట్టి ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు.

- Advertisement -

AAA సినిమాస్ అత్యాధునిక టెక్నాలజీతో రూపొందుతోంది. ఇందులో సినిమా చూస్తే అసాధారణమైన అనుభూతి పొందే అవకాశం ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టైల్, డిజైన్ తో పాటు AAA సినిమాస్ ఇంటీరియర్స్ అత్యద్భుతంగా, అత్యాధునికతను కలిగి ఉంటుంది. మల్టీప్లెక్స్‌ లో బ్లాక్-థీమ్ డెకర్ అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఇప్పటివరకు కూర్చుని చూసే థియేటర్లే ఉండగా, ఇందులో పడుకుని సినిమా చూసే అవకాశం ఉంది. అత్యంత విలాసవతంగా సినిమా అనుభూతిని పొందవచ్చు. కళ్లు జిగేలుమనే లైట్ల కాంతులతో థియేటర్ అత్యంత అద్భుతంగా కనిపిస్తోంది. AAA సినిమాస్‌లో ఐదు స్క్రీన్‌లు ఉన్నాయి. మొదటి దాంట్లో కాస్త ఎక్కువ ధర ఉంటుంది. ధరకు తగినట్లుగానే సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతికతతో సినిమా చూసే అవకాశం ఉంటుంది. వాటిలో బిగ్ ఫార్మాట్ EpiQ స్క్రీన్ ఉంటుంది. ఇది వీక్షకులను చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. అద్భుతమైన విజువల్స్, లీనమయ్యే సౌండ్ సిస్టమ్‌తో పెద్ద స్క్రీన్‌పై ప్రతి మూమ్ మెంట్ ను అద్భుతంగా తిలకించే అవకాశం ఉంటుంది.

ఇదంతా ఒకెత్తూయితే.. ఏఎంబీలో మహేష్ బాబు గ్యాలరీ పెట్టినట్టుగానే, ఏఏఏలో అల్లు అర్జున్ గ్యాలరీ పెట్టారు. దానికి అల్లు అర్జున్ ఐకాన్ గ్యాలరీ అని పేరు పెట్టారు. ఈ గ్యాలరీ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంటుంది. సువిశాలమైన ఈ గ్యాలరీలో అల్లు అర్జున్ సాధించిన అవార్డుల్లో కొన్ని ముఖ్యమైనవాటిని ఓవైపు ఉంచారు. దాని చుట్టూ అల్లు అర్జున్ సిగ్నేచర్ ను కూడా పొందుపరిచారు. మరోవైపు అల్లు అర్జున్ నటించిన సినిమాల పోస్టర్లతో ఫొటో ఫ్రేమ్స్ పెట్టారు. వాటికి మరింత అందం చేకూర్చేలా ఫోకస్ లైట్లు అమర్చారు. ఇంకోవైపు గోడకు వర్కింగ్ స్టిల్స్ కూడా పెట్టారు. రాఘవేంద్రరావు, సుకుమార్, త్రివిక్రమ్, గుణశేఖర్ లాంటి దర్శకులతో కలిసి వర్క్ చేసినప్పుడు తీసిన ఫొటోల్ని అక్కడ ఉంచారు.

మరో గోడకు అల్లు అర్జున్ స్పెషల్ ఫొటో గ్యాలరీ పెట్టారు. నిజజీవితంలో అల్లు అర్జున్ దిగిన ఫొటోలు పెట్టడం జరిగింది. భార్య, అన్న, తమ్ముడు, తండ్రి.. ఇలా తన కుటుంబ సభ్యులతో దిగిన స్టిల్స్ ఉంచారు. పూర్తిగా తన కుటుంబానికి మాత్రమే ఈ వాల్ ను పరిమితం చేశాడు. కాకపోతే చిరంజీవి తో దిగిన పిక్స్ ఎక్కడ పెట్టకపోవడం కాస్త నిరాశ కలిగించే అంశం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News