Sunday, October 6, 2024
HomeNewsశ్రీలీల.. స్టార్ హీరోయిన్ జాబితాలో చేరినట్లే..

శ్రీలీల.. స్టార్ హీరోయిన్ జాబితాలో చేరినట్లే..

- Advertisement -

శ్రీలీల..శ్రీలీల..ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎక్కడ విన్న ఈ పేరే వినిపిస్తుంది. సినీ లవర్స్ , అభిమానులే కాదు చిత్రసీమ సైతం శ్రీలీల జపం చేస్తుంది. అగ్ర హీరోలు , దర్శకులు , నిర్మాతల దగ్గరి నుండి చిన్న హీరోల వరకు శ్రీ లీల నే తమ సినిమాల్లో కావాలని కోరుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరు పెద్ద చిత్రాల్లో ఈ అమ్మడు నటిస్తుంది.

పెళ్లి సందD మూవీ తో తెలుగులో అరంగేట్రం చేసిన ఈ చిన్నది..మొదటి మూవీ తోనే యూత్ ను కట్టిపడేసింది. ఆ తర్వాత ధమాకా మూవీ తో ఓ ఊపు ఊపేసింది. గ్లామర్ తో పాటు డాన్స్ , యాక్టింగ్ తో ఆకట్టుకుంది. దీంతో అమ్మడి ఫై అందరు ఫోకస్ చేసారు. ప్రస్తుతం అల్లు అర్జున్ , మహేష్ , పవన్ కళ్యాణ్ , వరుణ్ తేజ్ , రామ్ , నితిన్ , బాలకృష్ణ సినిమాల్లో నటిస్తుంది. నిన్న (జూన్ 14) శ్రీ లీల పుట్టిన రోజు సందర్బంగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రాల తాలూకా ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.

త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘గుంటూరు కారం’ చిత్రంలో మహేష్‌బాబుతో జోడీ కడుతున్నది. ఈ సినిమా కొత్త స్టిల్‌లో ఈ సొగసరి సంప్రదాయ లంగావోణిలో కనిపించింది. ఇక బాలకృష్ణ నటిస్తున్న ‘భగవంత్‌ కేసరి’ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో కూడా చూడముచ్చమైన అందంతో ఆకట్టుకుంటున్నది. రామ్-బోయపాటి సినిమా నుంచి కూడా శ్రీలీల లుక్ ను విడుదల చేసారు. ఈ లుక్ లో మోడ్రన్ గెటప్ లో, నోటిలో వేలు పెట్టుకొని, నాటీగా కనిపించింది.

నితిన్-వక్కంతం సినిమా నుండి శ్రీలల పాత్రను పరిచయం చేస్తూ, డేంజర్ పిల్ల అనే క్యాప్షన్ తగిలించారు. ఇక వరుణ్ ఆదికేశవ సినిమా నుండి ఎల్లో శారీలో ముద్దుగా కనిపించే లుక్ ను, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బుంగమూతి పెట్టి, చిరుకోపంతో చూస్తున్న లుక్ ను విడుదల చేసి అలరించారు. అలాగే ఆహా కోసం అల్లు అర్జున్ తో ఓ ప్రాజెక్టు చేస్తోంది శ్రీలీల. దీనికి సంబంధించి కూడా ఓ లుక్ రిలీజైంది. ఇలా మొత్తం ఆమె నటిస్తున్న చిత్రాల నుండి ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలతో అమ్మడు టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News