Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుDisa App: మహిళలకు రక్షణ కవచం

Disa App: మహిళలకు రక్షణ కవచం

మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్ల సహాయం కోరచ్చు

దిశా యాప్ మహిళల భద్రత కోసం రూపొందించారని, ప్రతి ఒక్కరూ తమ మొబైల్ లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని డి ఎస్ పి సీతారామయ్య అన్నారు. మండల కేంద్రమైన గోనెగండ్లలోని వైయస్సార్ సర్కిల్ సమీపంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ సీతారామయ్య, ఎస్ ఐ తిమ్మారెడ్డి ల ఆధ్వర్యంలో దిశా యాప్ డౌన్లోడ్ పై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోనెగండ్లలోని పలు రహదారులపై మహిళా పోలీసులు, పోలీస్ సిబ్బంది వాహనదారులకు, ప్రజలకు దిశా యాప్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ యాప్ డౌన్లోడ్ చేయించి దిశా అప్ ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సీతారామయ్య మాట్లాడుతూ దిశా యాప్ ప్రాముఖ్యత మహిళల భద్రత-రక్షణ కోసం ఏర్పాటు చేశామన్నారు. అందుకోసమే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిశ యాప్ పై నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా తమ సిబ్బంది మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేయించామన్నారు.

- Advertisement -


మహిళలు నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్ల నుండి సహాయం కోరవచ్చునున్నారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్ కలిగి ఉండడం వల్ల ఆపద సమయాల్లో మహిళలు యాప్ లోని ఎస్. ఓ. ఎస్ బటన్ నొక్కితే చాలని పోలీసువారి సేవలో సత్వరమే అందుతాయన్నారు. ప్రతి ఒక్కరు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని సద్వినియం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News