Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుKurnool: పోలీస్ శాఖపై నమ్మకం పెరగాలి

Kurnool: పోలీస్ శాఖపై నమ్మకం పెరగాలి

ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పెండింగ్ కేసులను తగ్గించాలి

కర్నూలు జిల్లా రేంజ్ డీఐజీ ఎస్. సెంథిల్ కుమార్ వార్షిక తనిఖీలలో భాగంగా నంద్యాల జిల్లాలోని నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ ,2 టౌన్ పోలీసు స్టేషన్,ట్రాఫిక్ పోలీసు స్టేషన్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్ నంద్యాల టౌన్ లోని తాలూకా పోలీస్ స్టేషన్ కు రాగానే నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి, నంద్యాల అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వెంకట రాముడు మరియు నంద్యాల సబ్ డివిజన్ డిఎస్పి సి .మహేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు.

- Advertisement -

అనంతరం వివిద పోలీసు స్టేషన్ ల పరిదిదులలో అనగా నంద్యాల తాలూకా ఎస్సై రామ్మోహన్ రెడ్డి, 2 టౌన్ ఎస్సై హరి ప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై నవీన్ బాబు వారి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం స్టేషన్ పరిసరాలను, పోలీసు స్టేషన్ల పనితీరును పలు రికార్డులను స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని ఆదేశించారు. ఈ సందర్బంగా పోలీసు అదికారులకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. పోలీసు స్టేషన్ల పరిధిలో నేర, శాంతి భద్రతల పరిస్థితిలు, అసాంఘిక కార్యకలాపాల గురించి, ఎక్కువగా జరిగే నేరాలపై అధికారులను ఆరా తీశారు. మహిళలపై జరిగే నేరాలపై ప్రత్యక దృష్టి ఉంచాలని, దర్యాప్తులో ఉన్న కేసులలో వృత్తి నైపుణ్యతతో శాస్త్రీయ పద్ధతులలో దర్యాప్తు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించి నిందితులను అరెస్ట్ చేయాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పెండింగ్ కేసులను త్వరగా పూర్తిచేయాలని, గ్రేవ్ కేసుల్ని తగ్గించాలని వలయాదికారులను ఆదేశించారు. స్టేషన్ లో ప్రతి ఒక్క రిజిస్టర్ ను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్లు గురించి, 1930 గురించి, దిశ యాప్ రిజిస్టేషన్ మరియు డయల్ 112, 100 నంబర్లు వాటి ఉపయోగం గురించి విద్యార్ధులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై దృష్టి సారించాలని, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని, దొంగతనలు నివారణ కొరకు పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు.

విధినిర్వహణలో రోల్ క్లారిటీతో సమర్థవంతంగా పని చేయాలని, వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటిస్తూ, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని తెలియజేశారు. అనంతరం వార్డు మహిళ కార్యదర్శులతో మాట్లాడి వారికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రతి సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలని మీకు కేటాయించిన విధులలో సంతృప్తికరమైన స్థాయిలో పనిచేయాలని తెలియజేశారు. నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి తన సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం బ్లూ కోర్స్ వాహనాలను పరిశీలించారు. నంద్యాల పట్టణంలో ఎక్కడబడితే అక్కడ వాహనాలు పార్క్ చేయకుండా, వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని.రహదారులపై వాహనాలు నిలపడం, రాంగ్ రూట్, త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ లపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.


త్రిబుల్ డ్రైవింగ్ , ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ లకు పాల్పడే యువకులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించాలి. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News