జై శ్రీరామ్..జై ఆదిపురుష్…జై ప్రభాస్ ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ నినాదాలే వినిపిస్తున్నాయి. బాహుబలి మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్..ఆ తర్వాత సాహో, రాధే శ్యామ్ వంటి వరుస పాన్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ బాహుబలి రేంజ్ లో మాత్రం విజయాలు సాధించలేకపోయారు. అయినప్పటికీ ప్రభాస్ క్రేజ్ మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు. ప్రస్తుతం ఆదిపురుష్ మూవీ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించిన ఈ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్‌పై ఓం రౌత్ డైరెక్ట్ చేసాడు. ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందించారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుతతో ప్రేక్షకులు , అభిమానులు థియేటర్స్ కు పరుగులుపెడుతున్నారు.
తెలంగాణ లో ఉదయం నుండే ఆదిపురుష్ షోస్ మొదలయ్యాయి. సినిమాను చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ” సినిమా ఓ రేంజ్ లో ఉందని , ప్రభాస్ యాక్టింగ్ మరో లెవల్ అని, BGM గురించి ఎంత చెప్పిన తక్కువే అని ” కొంతమంది ట్వీట్స్ చేసారు.
ఫస్ట్ హాఫ్ బాగుంది. ప్రేక్షకుడు ఎంగేజ్ అయ్యేలా డైరెక్టర్ ఓం రౌత్ డ్రామా నడిపించారని అంటున్నారు. సాంగ్స్ మరో ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ సక్సెస్ అయ్యారంటున్నారు. ముఖ్యంగా జై శ్రీరామ్ సాంగ్ ఆకట్టుకుందని అంటున్నారు. శ్రీరాముడి కథ చెప్పిన విధానం బాగుంది. పాటలు, బీజీఎం, సినిమా కథకు సంబంధించిన ఆత్మ ఎక్సలెంట్. ప్రభాస్, కృతి సనన్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు అని మరికొంతమంది అంటున్నారు. పలువురు ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ చాలా పూర్ గా ఉన్నాయని అంటున్నారు.
ఓవరాల్ గా మాత్రం ఆదిపురుష్ కు పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. పూర్తి రివ్యూస్ వస్తే కానీ సినిమా పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ వస్తుంది.