Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Errakota Chennakesav: జగనన్న 'విద్యా కానుక' కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Errakota Chennakesav: జగనన్న ‘విద్యా కానుక’ కిట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపు రేఖలు మార్చుతున్నాం

జగనన్న విద్య కానుక కిట్లను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ నీలకంఠశ్వర స్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ జగనన్న నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపు రేఖలు మార్చడమే కాకుండా పిల్లలు బాగా చదవాలంటే వారికి పౌష్టిక ఆహారం కూడా అవసరమని అందుకోసం బడులలో మధ్యాహ్నం భోజనం మెనూ కూడా మార్చారు. ప్రతి పేద విద్యార్థికి అండగా ఉంటూ ప్రతి విద్యార్థికి బూట్లు, పుస్తకాలు, బ్యాగులు ఉచితంగా ఇస్తున్నామన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో కో ఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబ్బీర్ , ఎంఇఓ ఆంజనేయులు, వైసిపి నాయకులు శాబుద్దీన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News