దేశాభ్యున్నతి లక్ష్యంగా ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీ విస్తరణ విజయవంతంగా సాగుతున్నది. బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనికతే దేశానికి తక్షణావసరం అని భావించిన అనేక పార్టీలు, నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరి నిజమైన దేశ ప్రగతి పట్ల తమ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. ఇదే క్రమంలో మహారాష్ట్రలోని పలు పార్టీలకు చెందిన నాయకులు, ప్రముఖులు హైదరాబాద్ లో బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకుడు మాణిక కదమ్ తదితరులున్నారు.
బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో బీడ్ జిల్లా బీజేపీ కార్యదర్శి మయూరి ఖేద్కర్, ఔరంగాబాద్ జిల్లా ఎన్సీపి కార్యదర్శి సతీష్ బచాటే, బీజేపీ జిల్లా కార్యదర్శి మయూరి మస్కే ఖేద్కర్, పూణె విధానసభ మనసే హడప్సర్ అధ్యక్షుడు చంద్రకాంత్ సిమ్లా, పూణే మనసే యువక్ ఆఘాడి కి చెందిన కళ్యాణ్ కుమార్, మనసే కు చెందిన చిరంజీవి రాంరావు, జై భగవాన్ మహాసంఘ్ యువ తాలూక అధ్యక్షుడు పరమేశ్వర్ కేదార్, సర్పంచ్ లు మహాదేవ్ జవహరే, శరద్ సిర్సాత్, సంజయ్ కేదార్, గణేష్ జయభాయే, భగవాన్ జయభయే, విష్ణు సనప్, సంతోష్ బడే, అర్బాజ్ షేక్ తదితరులున్నారు.