Friday, November 22, 2024
HomeNewsరామ్ చరణ్ దంపతులు ఆలా చేయకపోవడం వల్లే ఆడపిల్ల జన్మిచ్చిందా..?

రామ్ చరణ్ దంపతులు ఆలా చేయకపోవడం వల్లే ఆడపిల్ల జన్మిచ్చిందా..?

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రయ్యాడు. మంగళవారం ఉదయం ఉపాసన పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి , బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్స్ తెలిపారు. ఈ వార్త తెలిసిన దగ్గరి నుండి మెగా ఫ్యామిలీ సభ్యులు , సినీ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ , సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. అయితే ఓ వార్త మాత్రం అందర్నీ మాట్లాడుకునేలా చేస్తుంది. అదే చిరంజీవి ఫ్యామిలీ లో 3వ తరం మొత్తం ఆడపిల్లలే పుట్టడం ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు.

చిరంజీవికి చరణ్ తో పాటుగా ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అందరికీ కూడా ఆడపిల్లలే జన్మించారు. మొదటి కూతురు సుస్మిత కు సమర మరియు సంహిత అనే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అలాగే రెండవ కూతురు శ్రీజా కి రెండు సార్లు పెళ్లి జరిగిన విషయం అందరికీ తెలిసిందే, మొదటి భర్త తో నివ్రితి అనే అమ్మాయి జన్మించగా, రెండవ భర్త కళ్యాణ్ దేవ్ తో నీవీక్ష అనే అమ్మాయికి జన్మని ఇచ్చింది. ఇప్పుడు ఉపాసన మరియు రామ్ చరణ్ కి కూడా ఆడపిల్లనే పుట్టడం తో చిరంజీవి కుటుంబం మూడవ తరం మొత్తం ఆడవాళ్లతోనే నిండిపోయింది.

అయితే రామ్ చరణ్ మరియు ఉపాసనకు ఆడపిల్లే పుడుతుందని జోతిష్యుడు ముందే చెప్పారట. మగబిడ్డ జన్మించాలంటే ఒక యాగం చెయ్యాల్సి ఉంటుందని చరణ్ మరియు ఉపాసనలకు తెలుపగా, మాకు మగబిడ్డనే కావాలని ఏమి లేదని, ఆడబిడ్డ అంటే మాకు ఎంతో ఇష్టమని, ఈ యాగాలు వంటివి ఏమి అవసరం లేదని చెప్పాడట రామ్ చరణ్. మరి నిజంగా చరణ్ ఆలా చెప్పాడా..? జోతిష్యుడు యాగం చేయమన్నారా..? లేదా అనేది క్లారిటీ లేనప్పటికీ.. ఇప్పుడు ఈ వార్త మాత్రం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారబోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News