ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ కు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ పవార్ నందలాల్ చేతులమీదుగా అందజేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకుగాను గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేశారు. అలాగే అధ్యాపకులు యాదగిరి గౌడ్, సత్తెమ్మ, దాంసింగ్, రఘునందన్ లకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కింది. వీరికి బోధనతో పాటు ఎన్ ఎస్ ఎస్ లో అందిస్తున్న సేవలకు ఈ అవార్డు దక్కింది. కళాశాల అధ్యాపక బృందం,విద్యార్థులు డాక్టర్ ఎన్ శ్రీనివాస్ కు అభినందనలు తెలియజేశారు. డాక్టర్ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని కళాశాలలో నాణ్యమైన విద్యా ప్రమాణాలు ఇంకా మెరుగయ్యేలాగా చూస్తానని పేర్కొన్నారు.
గత ఐదు సంవత్సరాల అధ్యాపకుల కృషి, కళాశాలలో బయట సమాజంలో చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని బెస్ట్ టీచర్ అవార్డు H. ధామ్ సింగ్ అందుకున్నారు. గత ఐదు సంవత్సరాలలో క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతూ నాక్ గ్రేడింగ్, కళాశాల అకాడమీ పనులలో, వనపర్తి జిల్లాలోని వివిధ గ్రామాలలో NSS పీవోగా 7 రోజుల పాటు వివిధ సామాజిక అవగాహన కార్యక్రమాలు చేయటం, జాతీయ స్థాయిలో గుజరాత్ రాష్ట్రంలో వర్క్ షాప్ కు ఎంపిక కావడం లాంటివి దృష్టిలో ఉంచుకొని ఉత్తమ అధ్యాపకుని అవార్డుకు ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ తెలిపారు. దాని ఫలితంగా మా కళాశాలలో 35 రోజులపాటు విద్యార్థులకు ప్రాజెక్టు చేసి విద్యార్థిని, విద్యార్థులకు కూడా జాతీయ స్థాయిలో వర్క్ షాప్ కు ఎంపిక చేశారన్నారు. పై కార్యక్రమాలు కాకుండా హైదరాబాద్ లోని ఐసిఎస్ఎస్ఆర్ గెస్ట్ హౌస్ లో పలు దఫాలుగా వర్క్ షాప్ కు ఎంపికైనట్టు చెప్పారు. రీసెర్చ్ ప్రోగ్రెస్ లో కూడా మంచి ఫలితాలు అందుకున్నారన్నారు.