Friday, April 18, 2025
HomeదైవంTTD Dharma Prachara Parishad: మోక్షానికి జ్ఞానమే ఏకైక సాధనం

TTD Dharma Prachara Parishad: మోక్షానికి జ్ఞానమే ఏకైక సాధనం

తల్లి తర్వాత గోవు సమస్త మానవాళికి తల్లి

సమస్త మానవాళికి తల్లి తర్వాత ఆ స్థానాన్ని పూర్తి చేసేది గోమాతేనని, అటువంటి గోవును, గో జాతిని సంరక్షించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బేతంచెర్ల మండలం, గోరుమానుకొండ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి జీవి ముక్తికి సోపానం జ్ఞానమేనని, అటువంటి జ్ఞాన సంపదకై కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు కోడె వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు జి. చిన్నమద్దిలేటి, పి.రామేశ్వరరెడ్డి, భజన మండలి అధ్యక్షులు కోడె వెంకటసుబ్బయ్య, ధర్మ ప్రచారకులు జి. బాలీశ్వర రెడ్డి, శంకరయ్య, జయన్న, నాగేంద్ర, వి. శ్రీనివాసులు, కె.శ్రీనివాసులు, చాకలి రామన్న, కొండారెడ్డి, సంజమ్మ, బాలదివమ్మ, లక్ష్మీదేవి, బుగ్గారెడ్డి, కె.భూపాల్ బి.ఎల్లశేషయ్య, మేకల శ్రీనివాసులు, యుగంధర్, మద్దయ్యతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News