రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆపరేషన్ చబుత్రా ను 1టౌన్ సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలీస్ అధికారులు సిబ్బంది తో కలిసి బైక్ పై పెట్రోలింగ్ చేస్తూ రాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్ల పై గుంపులుగా జులాయిగా తిరుగుతూ ప్రజలను ఇబ్బందిలకు గురిచేస్తూ, మద్యం సేవించి రోడ్లపై ద్విచక్ర వాహనాలతో తిరుగుతున్న యువకులను, అనుమానస్పదంగా తిరుగుతున్న వారిని ఉన్న 68 మంది యువకులను అదుపులోకి తీసుకొన్నారు. పట్టుబడిన వారిపై పెట్టి కేసు నమోదు చేసి, కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరించారు.
ఈ సందర్బంగా సీఐ ప్రమోద్ రావు మాట్లాడుతూ ఎలాంటి కారణంగా, ఎలాంటి పని లేకుండా అవసరమైతే తప్ప అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరు కూడా వీధుల్లో తిరిగ రాదని తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై విన్యాసాలు చేస్తూ, గుంపులుగా కనబడితే వారిని అరెస్ట్ చేసి వాహనాలను సీజ్ చేస్తామన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండి రాత్రి వేళలో ఆ కారణంగా బయటికి వెళ్లకుండా చూడాలన్నారు. ఆపరేషన్ చభుత్ర లో పట్టుబడిన వారి యొక్క వెహికల్స్ ను స్వాధీనం చేసుకొని వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని సీఐ ప్రమోద్ రావు తెలిపారు. ఆపరేషన్ చభుత్ర లో గోదావరిఖని టౌన్ ల సీఐ లు ప్రమోద్ రావు, ప్రసాద్ రావు, వేణుగోపాల్ లతో పాటు వన్ టౌన్, టూ టౌన్ సర్కిల్ ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.