Saturday, October 5, 2024
Homeహెల్త్Monsoon masks: చర్మాన్ని మెరిపించే మాన్సూన్ మాస్కులు

Monsoon masks: చర్మాన్ని మెరిపించే మాన్సూన్ మాస్కులు

చల్లదనాన్నిచ్చి, ట్యాన్ తగ్గించి, మెరుపునిచ్చే..

మారిన మాన్సూన్ లో చర్మాన్ని మెరిపించే ఫేస్ మాస్కులు…

- Advertisement -

రుతుపవనాల ప్రవేశంతో ఎండవేడిమి నుంచి ఉపశమనం అందనుంది. అయితే ఈ మార్పు ప్రభావం చర్మంపై పడే అవకాశం లేకపోలేదు. ఇందువల్ల చర్మం పొడిబారడం, కాంతివిహీనంగా కనపడడం, బ్రేకవుట్స్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్యలను అధిగమించేందుకు సహజసిద్ధమైన ఇంటి  చిట్కాలు కొన్ని ఉన్నాయి.  ఈ వాతావరణంలో మీ చర్మాన్ని గ్రీన్ టీ అండ్ హానీ ఫేస్ మాస్కుతో బాగా మెరిపించవచ్చు. ఒక టీ స్పూన్ గ్రీన్ టీ ఆకులు తీసుకుని వేడి నీళ్లల్లో పదినిమిషాలు ఉడకనిచ్చి ఆ నీళ్లను వొడగొట్టాలి.  అందులో టీస్పూను తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. గ్రీన్ టీ నీళ్లల్లోని యాంటాక్సిడెంట్లు వల్ల చర్మం కూల్ గా ఉంటుంది. తేనే చర్మంలోని హైడ్రేషన్ను కాపాడుతుంది. ఇంకోకటి కీర, పెరుగు కలిపిన ఫేస్ మాస్కు. దీన్ని కూడా ఇంట్లో సులువుగా తయారుచేసుకోవచ్చు. సూర్యరశ్మి బారిన పడిన చర్మానికి కావలసిన సాంత్వనను, మ్రుదుత్వాన్ని ఈ ఫేస్ మాస్కు ఇస్తుంది. ఒక టీస్పూను కీరకాయ పేస్టు, ఒక స్పూను పెరుగు తీసుకుని రెండింటినీ కలిపి ఆ మిశ్రమాన్నిముఖానికి పట్టించాలి. ఈ పేస్టును చేతులకు కూడా రాసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్కును ముఖానికి పట్టించుకున్న తర్వాత 20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ మాస్కు చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాదు సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. ట్యాన్ ను తగ్గిస్తుంది.

యాక్నేను నిరోధించే మరో వంటింటి ఫేస్ ప్యాక్ ఉంది. అదే వేప, పసుపు ఫేస్ ప్యాక్. ఒక టేబుల్ స్పూను వేప ఆకు పేస్టు, అరచెంచా పసుపు రెండింటినీ బాగా కలపాలి. ఆ పేస్టును ముఖానికి సరిసమానంగా ఉండేలా పట్టించి ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. వారానికి మూడుసార్లు ఈ ఫేస్ ప్యాక్ పూసుకుంటే యాక్నే సమస్య తగ్గుతుంది. ఇంకొకటి టొమాటో, షుగర్ ఫేస్ ప్యాక్. చర్మ రంధ్రాలలో చేరిన మురికి, నూనెను పోయేలా శుభ్రంచేయడంలో టొమాటోలు బాగా పనిచేస్తాయి. ఈ ఎక్స్ ఫొయిలేటింగ్ ఫేస్ మాస్కు తయారుచేయడానికి ఒక టీస్పూను షుగరు, ఒక టొమాటాపండు నుంచి తీసిన రసం రెడీ పెట్టుకోవాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని బాగా కలిపి దాన్ని బుగ్గలపై వ్రుత్తాకారంలో రుద్దుతూ చర్మానికి పట్టించాలి. తర్వాత ఐదు నిమిషాలపాటు దాన్ని అలాగే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల అది పొడారిపోతుంది. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం తాజాదనంతో మెరిసిపోతుంది. చర్మం ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

పసుపు, రోజ్ వాటర్ కలిపిన ఫేస్ ప్యాక్ చర్మానికి కావలసిన సాంత్వనను అందజేస్తుంది. దీన్ని కూడా ఇంట్లో సులభంగా తయారుచేసుకోవచ్చు. సూర్యరశ్మి బారిన పడిన చర్మంపై ఈ ఫేస్ ప్యాక్ ఎంతో బాగా పనిచేస్తుంది. చర్మానికి కావలసినంత ఉపశమనాన్ని అందజేస్తుంది. అంతేకాదు చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా పసుపులో రెండు స్పూన్ల రోజ్ వాటర్ ను కలిపి పేస్టులా చేసి సూర్యరశ్మి పడిన చర్మంపై ఈ మిశ్రమాన్ని పట్టించి ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేస్తే మీ చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాదు ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News