Tuesday, May 21, 2024
Homeఫీచర్స్Kitchen tips: కిచెన్ టిప్స్

Kitchen tips: కిచెన్ టిప్స్

గిన్నెలు మెరవాలంటే?

 మాడిపోయిన పాత్రలు శుభ్రం చేయాలంటే కాఫీ పొడిని వాటిపై చల్లి కాసేపటి తర్వాత తోమితే మంచి ఫలితం కనిపిస్తుంది.

- Advertisement -

 నల్లగా మారిన రాగి వస్తువులు అక్కడక్కడా నల్లని మరకలు ఏర్పడి చూడడానికి బాగుండవు. ఇవి తళ తళ లాడాలాంటే ఒక టిష్యూ పేపర్ పై కాస్తంత టొమాటో కెచెప్ ను వేసి ఆ రాగి పాత్రలను శుభ్రంగా తోమితే చాలు.

 ప్లాస్టిక్ పాత్రలకు అంటిన నూనె మరకలు పోవాలంటే వంటసోడాలో కొన్ని నీళ్లు కలిపి ఆ మిశ్రమంతో వాటిని కడగాలి.

 చెక్క స్పూన్లను కొద్దిసేపు వేడి నీళ్లల్లో మరిగించి ఆ తర్వాత ఎండలో ఆరబెడితే చాలు బాగా శుభ్రం అవుతాయి.

 కోడి గుడ్లను నేరుగా చల్లటి నీళ్లల్లో వేసి ఉడకబెట్టకుండా నీళ్లు కాస్త వేడెక్కాక అందులో గుడ్లు వేసి ఉడకబెడితే వాటిపై పెంకులు సులభంగా వస్తాయి.  దులో వెనిగర్ లేదా బేకింగ్ సోడా వేస్తే ఇంకా మంచిది.

 నట్స్ గట్టిగా ఉంటాయని చాలామంది వాటిని గది ఉష్ణోగ్రతలో ఉంచుతుంటారు. అందువల్ల వాటిల్లోని పోషకాలు పోతాయి. అలా కాకుండా ఫ్రిజ్ లో నట్స్ ను స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు ఉండడంతోపాటు అందులోని పోషకాలు కూడా భద్రంగా ఉంటాయి.

 కొన్ని పాత్రలు ఎంత శుభ్రం చేసినా మెరవవు. అందుకని ఒక టబ్ లో నీళ్లు పోసి అందులో కొంచెం వెనిగర్ కలిపి వాటిల్లో ఆ వంటపాత్రలను వేసి రాత్రంతా ఉంచి ఉదయాన్నే శుభ్రం చేస్తే అవి తళ తళ మెరుస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News