Friday, April 11, 2025
HomeతెలంగాణRythubandhu: 16,98,957 రైతుల ఖాతాల్లో 1278.60 కోట్లు

Rythubandhu: 16,98,957 రైతుల ఖాతాల్లో 1278.60 కోట్లు

రైతుబంధు పథకంతో తెలంగాణలో సాగు విప్లవం మొదలైంది

రైతుబంధు నిధులు రెండో రోజు 1278.60 కోట్లు విడుదల చేసినట్టు వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 16 లక్షల 98,957 మంది రైతుల ఖాతాలలో జమ అయినట్టు, రెండు రోజులలో 39,54,138 మంది రైతుల ఖాతాలలో 1921.18 కోట్లు జమ అయినట్టు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 38.42 లక్షల ఎకరాలకు రైతుబంధు అందినట్టు, రైతుబంధు పథకంతో తెలంగాణలో సాగు విప్లవం మొదలైందన్నారు. సాగునీటి రాక, ఉచిత కరంటుతో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా సాగులోకి వచ్చిందని, వ్యవసాయ రంగం చుట్టూ అల్లుకున్న రంగాలు బలోపేతం అవుతున్నాయన్నారు.

- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని, ఆహారశుద్ది పరిశ్రమలతో తెలంగాణ వ్యవసాయ రంగం రూపుమారుతుందన్నారు మంత్రి. ఆరుగాలం కష్టపడే రైతు నాలుగు పైసల లాభం కండ్ల చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షని, ఆ లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకుసాగుతున్నదన్నారు. రైతుబంధు నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో రైతాంగానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News