Friday, September 20, 2024
HomeతెలంగాణMahabubabad: 1,51,146 మంది గిరిజనులకు పోడు భూములు

Mahabubabad: 1,51,146 మంది గిరిజనులకు పోడు భూములు

ప్రారంభమైన పోడు భూముల పట్టాల పంపిణీ

రాష్ట్రంలో 1 లక్ష 51 వేల 146 మంది గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సగర్వంగా వెల్లడించింది. తెలంగాణ మలి దశ ఉద్యమంలో సమైక్య పాలకులను తరిమికొట్టిన నేల మానుకోటను ప్రత్యేకంగా గుర్తిస్తూ, సీఎం కెసిఆర్, మహబూబాబాద్ ను జిల్లా కేంద్రం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.

- Advertisement -

మహబూబాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ఆశా కిరణం, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మునిసిపల్ & ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కి ఘన స్వాగతం లభించింది. గిరిజనులంటే అపారమైన ప్రేమ కలిగిన సీఎం కెసిఆర్ వీరికి దారి చూపారని ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎర్రబెల్లి స్పష్టంచేశారు. ఈ రోజు నుండి రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం సీఎం కెసిఆర్ ప్రారంభించారని, ఇక్కడి నుండి మన కేటీఆర్ ప్రారంభించారన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం మేరకు 1 లక్ష 51 వేల 146 మంది కొత్త గిరిజన పోడు పట్టాదారులకు కూడా రైతుబంధు పంట పెట్టుబడి సహాయం ఇస్తున్నట్టు ఎర్రబెల్లి వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News