స్టైలిస్ట్ స్టార్, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాలను చాలా జాగ్రత్తగా, సెలెక్టివ్ గా చేస్తారు. ఇదే ఆయన హిట్స్ రేషియోను, ఇమేజ్ ను తారాస్థాయికి తీసుకెళ్లింది. మాస్ హీరోగా తనకు తిరుగు లేదనిపించుకున్న ఈ ‘పుష్ప’ హీరో ఇప్పుడు ‘ఆదిపురుష్’ దెబ్బకు మరింత అలర్ట్ అయ్యారట. ఆదిపురుష్ సినిమా కంటే ముందు మన బన్నీకి బాలీవుడ్ లో చాలా సినిమా ఆఫర్స్ క్యూ కట్టాయి. గెస్ట్ రూల్, ప్యాన్ ఇండియా మూవీస్, భారీ బడ్జెట్ సినిమాలు ఇలా ఒక్కటేమిటి చాలా రకాల సినిమాలు అల్లు అర్జున్ ను పలకరించినా ఆయన మాత్రం చాలా నెమ్మదిగా, స్ట్రాటజిక్ గా అడుగులు వేయటం మంచిదైందని బన్నీ క్లోజ్ సర్కిల్ లో కొత్త టాక్ మొదలైంది.
పుష్ప్ హిట్ తో బాలీవుడ్ కళ్లు బన్నీపై పడ్డాయి. అయితే అల్లు అర్జున్ కూడా ‘అశ్వత్థామ’ అనే ఒక సినిమా స్టోరీ విని ఫిదా అయ్యారు. ఆదిత్యా ధర్ అశ్వత్థామ లైన్లను అర్జున్ కు వినిపించారు. కానీ పూర్ వీఎఫ్ఎక్స్ వంటి పలు కారణాలతో ఆదిపురుష్ అట్టర్ ఫ్లాప్ కావటంతో బన్నీ పునరాలోచనలో పడ్డారట.
వీఎఫ్ఎక్స్ విషయంలో తెలుగు సూపర్ స్టార్స్ అంతా ఇప్పుడు ఇలానే సెకెండ్ థాట్ లో పడుతుండగా, బన్నీ మాత్రం ఎటువంటి మొహమాటానికి పోకుండా అశ్వత్థామ ఫిలిం మేకర్స్ కు తన ఆలోచనలన్నీ వివరించారట. సూపర్ హిట్ సినిమా ‘ఉరి’ డైరెక్టర్ ఆదిత్యా ధర్ చేయబోయే అశ్వత్థామా రిస్కీ ప్రాజెక్ట్ అని, జక్కన్న లాంటి వాళ్లు తప్ప మిగతావాళ్లు విజువల్ గా వీఎఫ్ఎక్స్ ను సక్సస్ఫుల్ గా ఎలివేట్ చేయలేరని బన్నీ అనుకుంటున్నారట. ఈ టెన్షన్, ఇంప్రెషన్ లో ఉన్న అల్లు అర్జున్ అసలు అశ్వత్థామను రిజెక్ట్ చేయటంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాపై 2 ఏళ్లు ఇన్వెస్ట్ చేయటం ఎంతవరకు రైట్ డెసిషన్ అని డైలమాలో పడ్డ బన్నీ, ఈ 500 కోట్ల భారీ బడ్దెట్ మూవీకి నో చెబుతారా అన్నది ఇండస్ట్రీలో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జియో స్టుడియోస్, ఆదిత్యా ధర్ సంయుక్తంగా ఈ సినిమా ప్లాన్ చేశారు.
మొత్తానికి ఆదిపురుష్ సినిమా టాలీవుడ్, బాలీవుడ్ కు మంచి లెసెన్స్ నేర్పినట్టుందని ఫిల్మీ పండిట్స్ చర్చించుకుంటున్నారు.