Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుCyber Crime: 7 కోట్లకు కిడ్నీ బేరం.. రూ.16 లక్షలు కొట్టేసిన సైబర్ ముఠా..!

Cyber Crime: 7 కోట్లకు కిడ్నీ బేరం.. రూ.16 లక్షలు కొట్టేసిన సైబర్ ముఠా..!

Cyber Crime: సైబర్ నేరగాళ్లు మరో భారీ దోపిడీకి పాల్పడ్డారు. కిడ్నీ అమ్మేందుకు ప్రయత్నించిన ఏపీ యువతిని నమ్మించి రూ.16 లక్షలు కొట్టేశారు. బాధిత యువతి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన యువతి హైదరాబాద్‌లో నర్సింగ్ కోర్సు చదువుతోంది. ఇటీవల తన అవసరాల కోసం తండ్రికి తెలియకుండా, ఆయన అకౌంట్ నుంచి రూ.2 లక్షలు వాడుకుంది.

- Advertisement -

ఈ విషయం తండ్రికి తెలిస్తే ఏమంటాడో అని భయపడింది. ఎలాగైనా ఆ డబ్బు అడ్జస్ట్ చేయాలనుకుంది. చివరకు డబ్బుకోసం కిడ్నీ అమ్మేందుకు సిద్ధపడింది. దీనికోసం ఆన్‌లైన్‌లో వెతికింది. అలా ఒక నెంబర్ కనిపించింది. దానికి మెసేజ్ చేయగా తిరిగి కాల్ చేశారు. వారితో తాను డబ్బు అవసరం ఉండి, కిడ్నీ అమ్మాలనుకుంటున్నట్లు చెప్పింది. ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు తన కిడ్నీని రూ.7 కోట్లతో కొంటామని చెప్పారు. ఆమెను నమ్మించేందుకు ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, అందులో రూ.3 కోట్లు జమ చేశారు. అయితే, ఆ డబ్బు తీసుకోవాలి అంటే దానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని, ఆ ట్యాక్స్ ఆమే చెల్లించాలని సూచించారు. నిజమని నమ్మిన యువతి వాళ్లు అడిగినట్లుగా డబ్బులు చెల్లిస్తూ వచ్చింది.

అలా రూ.16 లక్షలు వాళ్లకు చెల్లించింది. అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించని యువతి తను కిడ్నీ అమ్మాలనుకోవడం లేదని, తన డబ్బు తనకు తిరిగి ఇవ్వాలని అడిగింది. దీంతో వాళ్లు డబ్బు కావాలంటే ఢిల్లీ రావాలని చెప్పారు. నిజమే అనుకుని నమ్మిన యువతి ఢిల్లీ వెళ్లింది. అయితే, అక్కడికి వెళ్లాక వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో తాను మోసపోయానని ఆ యువతి గుర్తించింది. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చింది. తన తండ్రికి జరిగిన విషయం చెప్పి, ఆయనతో కలిసి గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇలాంటి మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News