Saturday, October 5, 2024
HomeతెలంగాణMallapur: ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం రైతు దీక్ష

Mallapur: ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం రైతు దీక్ష

ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభం అయ్యేదాకా దీక్ష కొనసాగిస్తా

తెలంగాణ వచ్చాక ముత్యంపేట గ్రామంలో ఉన్న నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని 9 సంవత్సరాలు గడిచినా ఏ ఒక్క నాయకుడు దీనిపై చర్య తీసుకోకపోవడం చాలా దురదృష్టకరమని వాపోతున్నారు ఇక్కడివారు. చక్కెర కర్మాగారాన్ని తెరిపించేందుకు నడుం బిగించారు స్థానిక చెరుకు సంఘం రైతు అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఈమేరకు ఆయన దీక్ష చేపట్టాడు. చక్కెర కర్మాగారం మళ్లీ తెరిపించే వరకూ తన దీక్ష కొనసాగనుందని, అప్పటివరకు గడ్డం వెంట్రుకలు తీయనని, చెప్పులు వేయనని ఏవి లేకుండా తిరుగుతానని, దీక్ష కొనసాగిస్తానని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని లేదా ఏ పార్టీ నాయకులైనా ఖచ్చితమైన నిర్ణయం మేరకు చక్కర కర్మగారాన్ని తెరిపిస్తా అని మాట ఇస్తారో వారికే చెరుకు సంఘం రైతులు పూర్తిగా మద్దతిస్తారన్నారు. ఈ దీక్షకు సంఘీభావంగా సిఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత చెన్నమనేని శ్రీనివాసరావు మద్దతుగా మాట్లాడుతూ ముత్యంపేట చక్కెర కర్మాగారం మూడు నియోజకవర్గాల రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని చక్కెర కర్మగారం మూతపడడం వలన ఎందరో యువకులు ఉపాధి లేక గల్ఫ్ బాట పట్టి, అక్కడ కూడా ఉపాధి దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటూ, కుటుంబాలకు తీవ్ర బాధను మిగిలుస్తున్నారు. ఇప్పటికైనా కెసిఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చక్కర ఫ్యాక్టరీ పునరుద్ధరణ దిశగా అడుగులు వేయాలని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎలక్షన్లో రైతులే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. చక్కెర ఫ్యాక్టరీ తెరిపించడానికి ఏ పార్టీ వారైనా పనిచేస్తారో వారికి పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మద్దతుగా గల్ఫ్ జేఏసీ అధ్యక్షుడు గుగ్గిళ్ళ రవి గౌడ్, వాకిటి సత్యం రెడ్డి, పాన్నాల తిరుపతిరెడ్డి, రామా గౌడ్, గాజుల రాజారెడ్డి, ఎక్స్ సి డి సి చైర్మన్ కంది బుచ్చిరెడ్డి, షేర్ నర్సారెడ్డి, వేంపేట ఉప సర్పంచ్ గోరుముంతల ప్రవీణ్, బద్దం స్వామి రెడ్డి, కోల నారాయణ, రైతు సంఘం నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News