Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభVijay Devarakonda: సొంత ఛానెల్ స్టార్ట్ చేసిన విజయ్

Vijay Devarakonda: సొంత ఛానెల్ స్టార్ట్ చేసిన విజయ్

ఖాకీగా విజయ్

‘అర్జున్ రెడ్డి’తో తనకంటూ డిఫరెంట్ ఇమేజ్ సెట్ చేసుకున్నారు హీరో విజయ్ దేవరకొండ.  తన క్లోతింగ్ స్టైల్ మొదలు, మాట్లాడే స్లాంగ్ వరకూ అన్నీ వెరైటీగా ఉండేలా పక్కా ప్లాన్ చేసుకునే విజయ్ తన ఫ్యాన్స్ ను మాత్రం బాగా చూసుకుంటారనేంత పాపులర్ అయ్యారు.  సోషల్ మీడియాలో తన ఫాలోయర్స్ కు అప్డేట్ ఇచ్చే విజయ్ లేటెస్ట్ గా వారికోసం ఏకంగా ఓ ఛానెల్ నే స్టార్ట్ చేయటం హైలైట్ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.  టెక్నాలజీని బ్రహ్మాండంగా యూజ్ చేసే ఈ హీరో ‘ద దేవరకొండ బ్రాడ్ కాస్ట్’ పేరుతో ఈ ఛానెల్ ప్రారంభించేశారు.

- Advertisement -

సెప్టెంబర్ 1న హిందీ, తెలుగులో ‘ఖుషీ’ సినిమా రిలీజ్ కానుంది.  సమంతో కలిసి రొమాన్స్ చేస్తున్న విజయ్ ఈమధ్యనే ఇంకా పేరు ఫిక్స్ కాని సినిమా షూటింగ్ మొదలు పెట్టారు.  ఇందులో పోలీస్ గా విజయ్ కనిపించనుండగా, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్.

విజయ్ దేవరకొండ ఇన్స్ఠాగ్రాంలో బ్రాడ్ కాస్ట్ ఛానెల్ స్టార్ట్ చేశారు.  తమ ఫ్యాన్స్ అందిరినీ లేదా ఒక్కొక్కరినే కలుసుకేందుకు ఈ ఛానెల్స్ మంచి వేదికలుగా మారాయి.  ఇన్స్టాలో ఈ మధ్యనే వచ్చిన ఈ ఫీచర్ టెర్రిఫిక్ గా ఉంది.  ఈ వేదికగా టెక్ట్స్, ఫోటో, వీడియో, వాయిస్ నోట్స్ ను షేర్ చేసుకోవటం చాలా ఈజీ.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News