వర్షాకాలం మొదలైందంటే ఫస్ట్ ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతాయి. మిగతా కూరగాయలు కూడా ఆషాఢం, శ్రావణంలో కొండెక్కి ఉంటాయి. అయినా ప్రతి సంవత్సరం ఇది షరామామూలు వ్యవహారంగా మారినా ముందస్తు చర్యలను తీసుకోవటంలో ప్రభుత్వాలు విఫలం అవుతూనే వస్తున్నాయి. లేటెస్ట్ గా ఉత్తరాఖండ్ లో టమోటాల ధర ఏకంగా 250 రూపాయలకు ఎగబాకింది. దీంతో చాట్ తయారు చేయటం చాలా కష్టంగా మారిందని చాట్ బండివారు ఇక్కడ గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు కనీసం టమోటాలు కూడా కొనలేని స్థితిలో ఉన్నామంటూ ఉత్తరాఖండ్ లోని సామాన్యులు మండిపడుతున్నారు.