సహజసిద్ధమైన మూలికా ఔషధంతో దగ్గును పూర్తిగా నయం చేసే సరికొత్త దగ్గు మందు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ లీ హెల్త్ డొమెయిన్ వాసా తులసి ప్లస్ పేరుతో దగ్గు నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని విడుదల చేసింది. సహజసిద్ధంగా మనకు ప్రకృతిలో లభించే వనమూలికలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేలా ఈ ఔషధాన్ని తయారుచేయటం విశేషం. వాము పువ్వుతోపాటు ప్రిమ్ రోజ్, తాలీస ఆకులు, వస, తులసి, శొంఠి, దుష్టపు తీగ, అతి మధురం, పిప్పళ్లు, దాల్చిన చెక్క, లవంగం, నల్ల మిరియాలు, పుదీనాతో ఈ దగ్గు ఔషధాన్ని తయారు చేసినట్టు కంపెనీ డైరెక్టర్ లీలా రాణి వివరించారు. కఫాన్ని తొలగించటంలో వస, వాము సాయపడతాయి. శ్వాస తీసుకోవటంలో ఉన్న ఇబ్బందులను కూడా ఈ ఔషధం వాడి అధిగమించవచ్చని లీ హెల్త్ కంపెనీ నిపుణులు వివరిస్తున్నారు. ఆస్తమా, దగ్గు, జలుబు, కోరింత దగ్గు, ఈసినోఫీలియా, గొంతు నొప్పి, బొంగురు గొంతు, సౌనస్ వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనానికి ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చని కంపెనీ ప్రకటనలో వివరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని ఔషధాల దుకాణాలతోపాటు లీ హెల్త్ డొమెయిన్ వెబ్ సైట్, అమెజాన్ లో వాసా తులసి లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.