వీర్నపల్లి మండల తెలుగుదేశం పార్టీలో అధ్యక్ష పదవుల గోల పార్టీ అధిష్టానం ఆదేశాలంటు సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి అవునూరి దయాకర్ రావు ఈ నేల 3 వ తేదీన అధికారికంగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి మండల కేంద్రానికి చెందిన పెడతానపల్లి రాములును వీర్నపల్లి మండల శాఖ అధ్యక్షులుగా నియమించారు. ఇదిలా ఉండగా గత పది పదిహేను సంవత్సరాల నుండి మండలంలో పార్టీ మనుగడ కాపాడి పార్టీ ప్రతి సమావేశంలో కార్యక్రమలలో పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడ్డానని చెప్తూ, అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పర్మాల మల్లేశ యాదవ్ మరొక్కరు. ఈ సందర్బంగా పర్మాల మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వారికీ నియోజకవర్గం ఇంచార్జ్ ల అనుమతి అవసరం లేదని, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు స్పష్టం చేశారాని మల్లేష్ యాదవ్ అంటున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గం ఇంచార్జ్ లు ఆధిపత్యం చెలాయిస్తున్నారని తనను అధిష్టానం అధ్యక్ష పదవి నుండి తొలగిస్తే తను తప్పుకుంటానని చెప్తూ అధ్యక్షులుగా కార్యక్రమలకు హాజరువుతున్నారు. తనను అధ్యక్ష పదవి నుండి తొలగించినట్టు, తనకు ఎవ్వరూ చెప్పలేదని రాత పూర్వక పార్టీ లేఖ లేదని, అధిష్టానం నూతన అధ్యక్షులుగా మరొక్కరిని నియమించాలని ఎలాంటి పార్టీ ఉత్తర్వులు లేవని, పార్టీ నియోజకవర్గం ఇంచార్జి దయాకర్ రావు తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన విధంగా చేస్తూ మాట మాత్రం చెప్పకుండా తన ఇస్టానుసారం పార్టీ నియమాలను లెక్క చేయకుండా మరొక్కరిని అధ్యక్షులుగా నియమించారని అన్నారు. ఇదిలా ఉంటే మండల ప్రజలు ఒక్క పార్టీకి ఇద్దరు అధ్యక్షులు ఏంటాని టిడిపి పార్టీలో జరిగే అధ్యక్ష పోరు సన్నివేశాలను చిత్రంగా చూస్తున్నారు. ఏదేమైనా పర్మాల మల్లేష్ యాదవ్ ను వీర్నపల్లి మండల అధ్యక్షులుగా ధ్రువీకరిస్తూ అవునూరి దయాకర్ రావు గతంలో రాసిన కేవలం తన పంతం నెగ్గడం కోసం పార్టీ అధిష్టానం పేరు చెప్పి అధ్యక్షున్ని దయాకర్ రావు మార్చారాణి అంటున్నారు మల్లేశం.
నూతన అధ్యక్షులు పెడతానపెల్లి రాములు మాత్రం కార్యవర్గ సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ గ్రామాల్లో పార్టీని ఎలా బలోపేతం చెయ్యాలో, గతంలో తెలుగు దేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమలను ప్రజలకు వివరించడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికైనా టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, అధిష్టానం పెద్దలు, రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ వీర్నపల్లి మండలంలోని టిడిపి కార్యకర్తలను సమన్వయం చేసి పార్టీ పునర్ నిర్నిర్మాణం చేయాలనీ వీర్నపల్లి మండల తెలుగు దేశం పార్టీ అభిమానులు అంటున్నారు.