Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్

Kurnool: సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్

రౌడీషీటర్లు, అనుమానస్పద వ్యక్తుల ఇళ్ళల్లో తనిఖీలు

శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కర్నూలు నాల్గవ పట్టణ పోలీసులు, 40 మంది స్పెషల్ పార్టీ పోలీసులు బృందాలుగా ఏర్పడి గురువారం తెల్లవారుజామున కర్నూలు పట్టణంలోని శరీననగర్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 10 మంది రౌడీ షీటర్లు, ఇద్దరు ట్రబుల్ మాంగర్స్, 3 అనుమానాస్పద ఇళ్ళల్లో తనిఖీలు నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా
ఎరుకలి రామాంజనేయులు ఇంట్లో 2 చిన్న కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా సరైన ధృవపత్రాలు లేని 2 ఆటోలు, 6 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో కర్నూలు నాల్గవ పట్టణ ఎస్ఐలు పెద్దయ్య నాయుడు, మధుసూదన్, సునీల్, కర్నూలు తాలూకా ఎస్సై రామయ్య, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News