Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుRamagundam commissionerate: అర్ధ వార్షిక నేర సమీక్ష

Ramagundam commissionerate: అర్ధ వార్షిక నేర సమీక్ష

ప్రతి గ్రామంలో రెండు సిసి కెమెరాల ఏర్పాటు కచ్చితంగా ఉండాలి

రామగుండం పోలీస్ కమిషనర్ పరిధి మంచిర్యాల్ జోన్, పెద్దపల్లి జోన్ పరిధిలోని మంచిర్యాల డిసిపి సుదీర్ రాంనాథ్ కేకన్, ఐపిఎస్, పెద్దపల్లి డిసిపి వైబావ్ గైక్వాడ్, ఐపిఎస్,. పోలీసు అధికారులతో రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి. ఐపీఎస్. డిఐజి. అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశంను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాలు-రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బందోబస్తు పటిష్ట ఏర్పాట్లు చేసిన పెద్దపల్లి డిసిపి వైబావ్ గైక్వాడ్ ఐపిఎస్, మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్ లకు ప్రశంసాపత్రాలను అందజేసి అబినదించారు. కమిషనరేట్ పరిధిలో గత రెండు నెలలుగా ఫంక్షనల్ వర్టికల్స్ లో ప్రతిభ కనబరిచిన నలుగురు ఇన్స్పెక్టర్స్, ఇద్దరు మహిళా ఎస్ఐ లు 18 సబ్ ఇన్స్పెక్టర్స్, 06-ఎఎస్ఐ లు, 45-కానిస్టేబుల్, 19-హెడ్ కానిస్టేబుల్, 06-మహిళా కానిస్టేబుల్/ హెడ్ కానిస్టేబుల్, 02- హోంగార్డ్స్ అధికారులు సిబ్బందికి రివార్డు మేళా నిర్వహించారు. అనంతరం సిపి పలు అంశాలపై, యూఐ కేసుల డిస్పోజల్, 2018 నుండి 2023 వరకు లాంగ్ పెండింగ్‌లో ఉన్న యూఐ కేసుల పరిష్కారంపై, ఏస్సీ /ఎస్టీ, విమెన్ ఎగైనెస్ట్ కేసులు, పోక్సో కేసుల, సినియర్ సిటిజన్ మైంటైనెన్స్ ఆక్ట్ కేసుల పరిష్కారం, కన్వెన్షన్ నిందితులు నిర్దోషిగా విడుదలకు పోలీసులకు వ్యతిరేకంగా గౌరవ కోర్ట్ లో అప్పీల్ పిటిషన్లపై, ఫంక్షనల్ వర్టీకల్స్ వారిగా అధికారుల, సిబ్బంది పనితీరు, వర్టికల్స్ పనితీరు మెరుగుపడాల్సిన వర్టికల్స్ శిక్షణపై సూచనలు, ఆదేశాలు చేశారు. ప్రతి గ్రామంలో రెండు సిసి కెమెరాలు ప్రాజెక్ట్ ద్వారా రామగుండం పోలీస్ కమిషన్ పరిధిలోని గ్రామాలవారీగా సిసి కెమెరాల ఏర్పాటు, ఏర్పాటు చేసిన కెమెరాల పనితీరుపై సమీక్షించారు.

- Advertisement -


సి.సి.టి.ఎన్.ఎస్ వెర్షన్ 2.0 వినియోగంపై అధికారులకు శిక్షణ, క్రైమ్ డేటా బేస్ మేనేజ్మెంట్ పనితీరుపై ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఆకస్మిక తనిఖీలు, ఇ-పెట్టి కేసులు, ఐడి లిక్కర్ గంజాయి, నకిలీ విత్తనాల అక్రమ రవాణా నిల్వకి సంబందించిన కేసుల వివరాలు, తీసుకుంటున్న చర్యలపై, షీ టీమ్‌లు పనితీరు, అవగాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్ లు, నమోదు చేయబడ్డ కేసులకు సంబంధించి వివరాలపై, ఏ.హెచ్.టి.యూ టీమ్, ఆపరేషన్ ముస్కాన్ టీంలు చేస్తున్న కార్యక్రమాలు, చేపడుతున్న చర్యలపై, సైబర్ క్రైమ్ కేసుల పురోగతి, అవగాహన, శిక్షణ కార్యకలాపాలపై, ట్రాఫిక్ పోలీస్ వారు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు, కాంటాక్ట్, నాన్ కాంటాక్ట్ ద్వారా వేసిన చలాన్స్ వివరాలు మరియు పెడింగ్లో ఉన్న చలాన్స్ వివరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు వివరాలు, శిక్ష పడిన కేసుల వివరాలపై, కమిషనరేట్ పరిధిలోట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ… ప్రతి ఒక్క అధికారి స్టేషన్ హౌస్ మేనేజమెంట్ తెలిసి ఉండాలి ఎస్.హెచ్.ఓ అధికారి క్రమశిక్షణతో నిబద్దతతో పనిచేస్తే సిబ్బంది కూడా మంచిగా పనిచేస్తారు. ప్రతి రోజు రోల్ కాల్ నిర్వహించాలి దాని వలన ప్రతి ఒక్క సిబ్బందితో మాట్లాడి వారు చేస్తున్న డ్యూటీ గురించి, ఎవరు ఏ డ్యూటీ చేస్తున్నారు, సిబ్బందికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని సిబ్బందితో మాట్లాడి తెలుసుకోవచ్చు అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలలో నమ్మకం, సెన్సాఫ్ సెక్యూరిటీ కలిగే విధంగా విశబుల్ పోలీసింగ్ ఉండాలి, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామం, పట్టణం, కాలనీలలో మహిళలలు, చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్స్ సమస్యలపై, వారిపై జరుతున్న అఘాత్యాలపై, స్థానిక సమస్యలపై, స్థానిక కళాకారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించాలి, ప్రతి నెల 30 తేదిన సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రతి గ్రామంలో రెండు సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలిలో భాగంగా సిసి కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను అవగాహన పరుస్తూ… సిసి కెమెరాల ఏర్పాటును మరింత ప్రోత్సహించే విధంగా అందరు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో రెండు సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలిలో భాగంగా పెద్దపల్లి జోన్ లో 270 గ్రామాలు, 50 డివిజన్స్ లో 3629 సిసి కెమెరాలను మంచిర్యాల జోన్ లో 350 గ్రామాలు, 160 వార్డ్స్ లో 2623 సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. గంజాయి అక్రమ రవాణా, అమ్మకంపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలనీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రాబోవు ఎన్నికల సమయం లో ఎలాంటి ఇబ్బందులు కలగా కుండా అందుబాటులో ఉన్న సిబ్బందితో సిద్దంగా ఉండాలి. సిబ్బందికి మాసికంగా వారిని సన్నద్ధం చేయాలి అన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ లను గుర్తించాలి. రూట్ బందోబస్తు ఏర్పాట్లు ముందుగానే పరిశిలించాలి. మొబైల్ పోయినా లేదా దొంగిలించిన బడిన బాధితులు సి.ఇ.ఐ.ఆర్ పోర్టల్ లో రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో689 ఫిర్యాదు చేయగా అందులో 101 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా 84 మొబైల్ ఫోన్స్ ట్రేస్ చేశారు.

మంచిర్యాల జోన్ పరిధిలో…

32 కేసులలో నిందితులకు గౌరవ కోర్ట్ జైలు శిక్ష, జరిమానా లు విధించామన్నారు. మంచిర్యాల జోన్ పరిధిలో 2606 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు 56553. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 1783. ఇ-పెట్టి 5101 కేసులు నమోదు. నకిలీ విత్తనాల కేసులు 04 కేసులు నమోదు. ఇసుక అక్రమ రవాణా కేసులు 03 నమోదు. ఎక్సైజ్ కేసు 02 నమోదు.

గత 6నెలలలో పెద్దపల్లి జోన్ పరిధిలో…

15 కేసులలో గౌరవ కోర్ట్ జైలు శిక్ష విధించారన్నారు. 103 కేసులలో గౌరవ కోర్ట్ నిందితులకు జరిమానాలు విధించారన్నారు. సుల్తానాబాద్, గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో రెండు కేసులలో నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించారు. 147 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా 83 కేసులు ఛేదించారు. పెద్దపల్లి జోన్ పరిధిలో 3643 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం లో 810 ఏర్పాటు చేశారు. ఎన్.బీ.డబ్ల్యూ లు 67 ఎగ్జిక్యూటివ్. 07 గురు నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 3676 నమోదు. ఇ-పెట్టి కేసులు 6740 నమోదు చేశామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News