TDP-YSRCP twitter war: అధికార వైసీపీ – ప్రతిపక్ష టీడీపీ మధ్య రోజురోజుకీ రాజకీయ శతృత్వం పెరిగిపోతోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు ఇవే మాకు ఆఖరి ఎన్నికలు అన్నట్టు వ్యాఖ్యలు చేయడం వైసీపీని పిలిచి మరీ తమ జుట్టు చేతికిచ్చినట్టైంది. జగన్ రెడ్డి ముఠా బేగంపేట విమానాశ్రయం నుండి ప్రైవేటు విమానాల్లో నల్లధనాన్ని తరలిస్తున్నారని టీడీపీ నేత పట్టాభి తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. దానిపై విజయసాయిరెడ్డి తీవ్రపదజాలంతో ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్ కు పట్టాభి కూడా తనదైన శైలిలో బదులిచ్చారు.
“ఒరేయ్ ‘పొట్టా’భి! నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదురా! గతంలో ఇలా మాట్లాడే మాల్దీవ్స్ పారిపోవాల్సి వచ్చింది. నీకు దేవుడు దున్నపోతులా శరీరాన్నిచ్చాడు కానీ అందులో ఆవగింజంత కూడా మెదడు పెట్టడం మర్చిపోయాడురా.” అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేయగా.. “హోటల్ యజమానిగా లక్షలమందికి స్వచ్ఛమైన భోజనం పెట్టి “భళా”అనిపించుకున్న చరిత్ర నాదిరా,తప్పుడులెక్కలు రాసి జైల్లో చిప్పకూడు తిని CA వృత్తికే కళంకం తెచ్చిన చరిత్ర నీదిరా బేవకూఫ్.కల్తీమద్యం సొమ్ముమింగి అడ్డంగ దొరికిపోయి దేహి అంటూ ఢిల్లీ పెద్దల బూట్లు నాకుతున్న నువ్వారా నీతులు చెప్పేది” అని రిప్లై ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ కు బదులుగా విజయసాయి రెడ్డి మరో ట్వీట్ చేశారు. “ఒరేయ్ ‘పొట్టాభి’! హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా చేసి సర్వర్ గా పని చేస్తున్న నిన్ను బాబు పార్టీలోకి తెచ్చాడు. హోటల్లో తిని తిని సీమ పందిలా వార్లు తేలేట్టు బలిశావ్. సింగపూర్లో హోటల్స్, స్విస్ బ్యాంకుల్లో నల్లడబ్బు దాచింది, మలేసియాలో వెయ్యి కోట్లు పోగొట్టుకున్నదెవరో బాబుని అడుగు.” అంటూ వరుసగా చంద్రబాబు, లోకేష్ ని టార్గెట్ చేసి ట్వీట్లు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి చేస్తున్న ట్వీట్లపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.