Monday, May 20, 2024
Homeహెల్త్మొలకలను ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసా?

మొలకలను ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసా?

- Advertisement -

ఈ రోజుల్లో చాలామందిని అధికంగా బాధించే సమస్య ఊబకాయం. ఆహారం తీసుకున్నా తీసుకోక పోయినా చాలామందికి శరీరం పెరిగిపోతుంటుంది. అలాంటి వారితో పాటు.. డైట్ మెయింటెన్ చేసే వారు ఎక్కువగా తీసుకునే ఫుడ్ రా ఫుడ్. అవే మొలకలు. బరువు పెరగాలన్నా.. తగ్గాలన్నా శరీరానికి సరైన మోతాదులో పోషకాలు అవసరం. ఆ పోషకాలు పిండి పదార్థాల్లో అధికంగా ఉంటాయి. మొలకలుగా తీసుకునేవాటిలో ఉండేవి పిండి పదార్థాలేనని తెలిసిందే. వాటిలో విటమిన్ బి6 సమృద్ధిగా లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం. డైటీషియన్స్ కూడా ముందుగా రా ఫుడ్ నే సూచిస్తారు.

కానీ చాలా మంది మొలకలను తినేందుకు ఇష్టపడరు. నిర్లక్ష్యం చేస్తుంటారు. మరికొందరిలో అసలు మొలకలు పచ్చిగా తినాలా, ఉడికించి తినాలా అన్న సందేహాలున్నాయి. నిపుణులు.. వీటిని ఎలా తీసుకున్నా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని చెబుతున్నారు. అయితే మొలకెత్తిన విత్తనాలను నీటిలో ఉడికించకుండా ఆవిరిపై ఉడికిస్తే అందులోని పోషకాలు తొలగిపోకుండా ఉంటాయట. ఉదయం టిఫిన్ కి బదులుగా మొలకలను తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. వీటిలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆహారం. సులభంగా జీర్ణమయ్యే గుణాన్ని కలిగి ఉంటాయి. రాత్రి భోజనంలో కూడా మొలకలు తీసుకుంటూ ఉంటే బరువు తగ్గవచ్చు.

అంతేకాదు మొలకలను తినడం వలన జీవక్రియలు కూడా వేగవంతమవుతాయి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. కానీ వీటితో ఒక సమస్య ఉంది. మొలకల వల్ల వాతం పెరుగుతుంది. చాలామందికి దానివలన కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. వీటిని నీటిలో నానబెట్టిన తర్వాత.. తినేందుకు ఆవిరికి ఉడకబెట్టడం మంచిది. దుర్వాసన వచ్చే మొలకలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. దాని వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు రావొచ్చు. కాబట్టి మొలకెత్తిన వాటిని తినేముందు శుభ్రంగా కడిగి తినడం మంచిదని నిపుణుల సూచన.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News