Saturday, October 5, 2024
HomeతెలంగాణChevella: రాష్టంలో గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి

Chevella: రాష్టంలో గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి

కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాందాస్ అథావాలేకు వినతిపత్రం అందజేత

చేవెళ్ల నియోజకవర్గంలో ప్రభుత్వ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని హైదరాబాద్ లో కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు రాందాస్ అథావాలేకు తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ (టిఎస్ఎస్ఒ) రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్ ప్రభుత్వ గురుకులాలకు సొంత భవనాలు కల్పించాలని వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సొంత భవనాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థుల సమస్యలు దృష్టిలో ఉంచుకొని సొంత భవనాలు కల్పించాలని కోరామన్నారు.

- Advertisement -

ఈ విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించారని త్వరలో అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ చేపట్టే కార్యక్రమాలను, విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న లక్ష్మీనివాస్ ను మంత్రి అభినందించారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అనిల్ యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీసాల వంశీ, శివకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News