Sunday, November 24, 2024
Homeఓపన్ పేజ్Census: జనాభా లెక్కల ఊసేదీ?

Census: జనాభా లెక్కల ఊసేదీ?

దేశంలో జనాభా లెక్కల సేకరణకు సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉంది. అనేక క్లిష్ట కఠినాతి కఠిన సమ యాల్లో కూడా జనాభా గణనను చేపట్టడం జరిగిందని ఈ చరిత్ర తెలియజేస్తోంది. ఈ జనాభా లెక్కల అవసరాన్ని అనేక కోణాల నుంచి ఆలో చించాల్సిన అవసరం ఉంది. అనేక సంవత్సరాల నుంచి దేశంలో ఈ వ్యవహారం ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు చేపడతారన్నది కూడా ఇదమిత్థంగా తెలియదు. అయి తే, దీనికున్న ప్రాధాన్యాన్ని ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. ఆర్థికాభివృద్ధిలో వేగం పెంచడానికి కొద్ది సంవత్సరాల క్రితం గుడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ (జి.ఎస్‌.టి)ని ప్రభుత్వం ప్రవే శపెట్టింది. దాని ప్రయోజనం నెరవేరిందో లేదో ఎలా తెలుస్తుంది? ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి వివరాలు తెలియడం చాలా కష్టం. ఎందుకంటే, దేశంలో గత పదేళ్ల కాలంలో జనాభా లెక్కల గణనే జరగ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎం త వరకూ అమలు జరుగుతున్నాయో, చేరవలసిన వారికి చేరుతున్నాయో, లేదో, ప్రజలు ఎంత వరకూ లబ్ధిపొందుతున్నాయో ఎవరైనా అధ్యయనం చేశారా? జనాభా లెక్కల గణనే లేనప్పుడు ఇవన్నీ ఎలా తె లుస్తాయి? జనాభా లెక్కలు ఉన్నట్టయితే, ఈ పథకాలను మార్చాలా, వద్దా అన్న సంగతి అర్థమవుతుంది.
ఇవే కాదు. దేశ అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ఇటువంటివి అనేక పథకాలు, కార్యక్రమాల గురించి తెలియాలన్నా, దేశ ప్రగతికి సంబంధించిన అంశాల్లో మార్పులు, చేర్పులు చేయాలన్నా తప్పనిసరిగా జనాభా లెక్కల గణన అవసరం. అయితే, ఏళ్లూ, పూళ్లూ గడుస్తున్నా జనాభా గణన ఊసే ఎక్కడా కనిపించడం లేదు. విచిత్రమేమిటంటే, 2024లో లోక్‌సభ ఎన్నికలు జరిగే లోపు జనాభా లెక్కల గణన జరిగే అవకాశమే లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే, మరో ఏడాదిన్నర దాకా నిరీక్షించక త ప్పదన్న మాట. అనేక క్లిష్ట సమయాల్లో కూడా జనాభా లెక్కలను గణించిన చరిత్ర ఉన్న భారత దేశంలో ఇంత ఆలస్యంగా ఇవి జరగడం నిజంగా జీర్ణించుకోలేని విషయం. 1941లో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా జనాభా లెక్కలను సేకరించారు. 1961లో చైనా మనతో కయ్యానికి కాలుదువ్వుతున్నప్పుడు కూడా జనాభా లెక్కల గణన ఆగిపోలేదు. ఇక 1971లో బంగ్లాదేశ్‌ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా జనాభా లెక్కల సేకరణ జరిగింది.
నిజానికి, ఈసారి జనాభా లెక్కల సేకరణ జరగకపోవడానికి కారణం కొవిడ్‌ మహమ్మారి అని చెబుతున్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి ఇది. దాదాపు అన్ని దేశాల్లోనూ ఆర్థిక వ్యవస్థలు కకావికలమైపోయాయి. ఇళ్లకు సంబంధించిన వివరాల సేకరణ 2020 మధ్యలోనూ, జనాభా లెక్కల సేకరణ 2021 ఫిబ్రవరిలోనూ జరగాల్సి ఉంది. అయితే, ఈ మహమ్మారి కారణంగా అంతా అస్తవ్యస్త మైపోయింది. ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ ఫండ్‌ అనే సంస్థ అందజేసిన వివరాల ప్రకారం, సుమారు దేశాలు 150 దేశాల్లో 2020, 2021 సంవత్సరాల్లో జనాభా లెక్కల సేకరణ జరగాల్సి ఉంది. కొన్ని తప్ప చాలా దేశాలు జనాభా లెక్కల సేకరణను నిరవధికంగా వాయిదా వేశాయి. అయితే, అమెరికా మాత్రం కొద్దిపాటి మార్పులతో ఈ వ్యవహారాన్ని విజయ వంతంగా పూర్తి చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని, సెన్సస్‌ సి బ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా ఈ సేకరణ కార్యక్రమంలో కొద్దిగా మార్పులు చేయవలసి వచ్చింది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని కొవిడ్‌ మహమ్మారి మరీ ఎక్కువగా వ్యాపించడంతో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. పైగా, దేశంలోని అన్ని వర్గాలను కలుపుకుని పోవడానికి కొద్దిగా సమయం పట్టింది.
గాలిలో దీపం
కొవిడ్‌ మహమ్మారి సందర్భంగా దేశంలో కార్యకలాపాలన్నీ, ప్రభుత్వ వ్యవహా రాలన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయని కూడా చెప్పడానికి వీల్లేదు. కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా 2020 నుంచి అనేక రాష్ట్రాలలో శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ, అస్సాం, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు యథావిధిగా జరగడం మరచిపోకూడదు. ఈ రాష్ట్రాలలో ఎన్నికల సమ ప్రచారం కూడా ఉధృతంగా జరిగింది. నాయకులు వెనుకా ముందూ చూడకుండా, కనీసం సామాజిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం, శానిటైజేషన్‌ లేకుండా ప్రజల్లో కలిసిపోయి ప్రచారం చేశారు. అంతేకాదు, పండుగలు, పర్వదినాలన్నీ యథా విధిగా పెద్ద ఎత్తున జరిగాయి కూడా. వాటికి లేని అభ్యంతరం జనాభా లెక్కలకు మాత్రం ఎందుకు?
దేశ ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన కీలక సమాచారం ప్రభుత్వం లేకపోవడం అనేక సమస్యలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలకు సంబంధించిన అబ్ధిదారులను తగినంత సమాచారం లేకుండా గుర్తించడమంటే, చీకటిలో కాల్పులు జరపలాంటిదే అవుతుంది. వ్యాపారాలు, వాణిజ్యాల విషయానికి వస్తే, ఎక్కడ హెూటళ్లు, రెస్టారెంట్లు ప్రారం భించాలి. ఎక్కడ మాల్స్‌ ఏర్పాటు చేయాలి, ఎక్కడ కర్మాగారాలు, కార్యాలయాలు నెల కొల్పాలి, కార్యకలాపాలను ఎక్కడెక్కడ విస్తరించాలి, ఎక్కడ ఏ వస్తువు అమ్ముడుపోతుంది వంటి అంశాలు క్షుణ్ణంగా తెలియాలంటే జనాభా వివరాలు తప్పనిసరిగా తెలియాల్సి ఉంటుంది. కాలం చెల్లిన వివరాలతో, గ ణాంకాలతో ముందుకు వెళ్లడం చాల కష్టం.
ఒక విశ్వశక్తిగా ఎదగాలనుకుంటున్న భారతదేశం ఇటువంటి సమాచారాన్ని తప్పని సరిగా సేకరించి ఉంఉకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, ప్రైవేట్‌ సంస్థలు కూడా ఈ రకమైన సమాచారాన్ని ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఇటువంటి డాటా సేకరణ సంస్కృతిని అలవరచుకోవడానికి భారత్‌ ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. సకాలంలో జనాభా లెక్కలను సేకరించడం అందుకు కీల కం. భారతదేశం చాలా పెద్ద దేశం. పైగా వైవిధ్యం చాలా ఎక్కువ. అందువల్ల ప్రజల గురించి, వారి అవసరాల గురించి పూర్తి వివరాలను సేకరించడం అతి ముఖ్యమైన వ్యవహారం. ఆహార భద్రత, వృద్ధులకు పింఛన్‌, కిసాన్‌ సమ్మాన్‌ వంటి సంక్షేమ పథకాలకు జనాభా లెక్కల నుంచి కాకుండా మరే విధంగా వివరాలు సేకరించగలం? అంతేకాదు, రాష్ట్రాలకు కేటాయింపులు జరపాలంటే కేంద్రం వద్ద తప్పకుండా డాటా ఉండాల్సిందే. ఫైనాన్స్‌ కమిషన్లకు ఈ వివరాలు అందజేయని పక్షంలో అవి వృథాగా ఉండిపోతా యి. లోక్సభ, శాసనసభల ఎన్నికలకు ఎంతో జనాభా వివరాలు అవసరమవుతాయి. ఇవి లేకుండా ఎన్నిక లు ఎలా నిర్వహించగలమో అర్థం కాని విషయం. అందువల్ల జనాభా లెక్కల సేకరణకు ఎంత త్వరగా నడుం బిగిస్తే అంత మంచిది.

- Advertisement -

జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News