Monday, November 25, 2024
Homeహెల్త్Hair fall control: వెంట్రుకలు రాలకూడదంటే..

Hair fall control: వెంట్రుకలు రాలకూడదంటే..

ఈ చిన్న చిట్కాలు మీకు చాలా సాయం చేస్తాయి, ట్రై చేయండి

జుట్టు రాలకుండా కొన్ని నేచురల్ టిప్స్….

- Advertisement -

జుట్టు రాలకుండా సంరక్షించుకునేందుకు కొన్ని సహజమైన టిప్స్ ఉన్నాయి. ఇవి వెంట్రుకలు ఊడకుండా నిరోధించడమే కాకుండా శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాహారం, సరైన శిరోజాల సంరక్షణ, జీవనశైలి మార్పులు వంటివి పాటిస్తే జుట్టు ఊడదు, రాలదు. ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం, ఒత్తిడి వంటివి కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు. ఇందుకు నేచురల్ టిప్ప్ కొన్ని ఉన్నాయి.

ఈ సమస్యను నివారించాలంటే మొదట శిరోజాల సంరక్షణ పరంగా తగిన జాగ్రత్తలను నిత్యం పాటించాలి. మాడును ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవాలి. కొబ్బరినూనె, ఆర్గాన్ నూనె, పిప్పరమెంట్ నూనె, ఆముదం నూనె వంటి వాటితో మాడును మసాజ్ చేసుకుంటే జుట్టు రాలదు. అంతేకాదు ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బాగా ఒత్తుగా పెరుగుతాయి. హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ కూడా వెంట్రుకలకు మంచిది. దీన్ని చేసుకోవడం వల్ల నూనె మాడు లోపలికంటా ప్రవేశించి జుట్టు కుదుళ్లను పటిష్టం చేయడమే కాకుండా కుదుళ్ల నుంచీ వెంట్రుకలు బలంగా ఉండేలా చేస్తుంది. మాడుపై వ్రుత్తాకారంలో మెల్లగా 20 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. మరో టిప్పు ఏమిటంటే రకరకాల హోమ్ మేడ్ మాస్కులు కూడా ఉన్నాయి.

మీ శిరోజాల అవసరాలకు, సమస్యలకు అనుగుణంగా హెయిర్ మాస్కులను జుట్టుపై అప్లై చేస్తే మంచి ఫలితాలను చూస్తారు. మాడును మసాజ్ చేసుకున్న తర్వాత ఇంట్లో తయారు చేసిన మాస్కును తలకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండడమే కాదు, మ్రుదువుగా, నిగనిగలాడుతూ ఉంటుంది. కుదుళ్లు సైతం ఆరోగ్యంగా ఉంటాయి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉదాహరణకు గ్రీన్ టీ, గుడ్డు కలిపి చేసిన హెయిర్ మాస్కు వెంట్రుకలపై బాగా పనిచేస్తుంది. గ్రీన్ టీలో ఎజిసిజి (ఎపిగల్లొకాటెచిన్-3-గల్లేట్) ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను వృద్ధిచేస్తుంది. గుడ్డులో జుట్టు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు అవసరమయ్యే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. తాజాగా చేసిన గ్రీన్ టీలో ఒకటి లేదా రెండు గుడ్డుసొనలను వేసి బాగా కలపాలి. ఆ మాస్కును జుట్టు కుదుళ్ల నుంచి వెంట్రుకల పొడుగుతా అప్లై చేస్తే ఆరోగ్యవంతమైన, ఒత్తైన, నిగనిగలాడే జుట్టు మీ సొంతమవుతుంది.

ఉల్లిపాయ మాస్కును కూడా వెంట్రుకలకు పెట్టుకుంటే మంచి ఫలితాలు చూస్తాం. కారణం జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, సి, ఇ మరియు ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, మెగ్నేషియం, కరొటెనె వంటివి ఇందులో ఉంటాయి. ఉల్లిపాయను మెత్తగా చేసి అందులోంచి రసం పిండాలి. దాన్ని మాడుపై రాసి 20 నుంచి 30 నిమిషాల దాకా అలాగే ఉంచి ఆ తర్వాత తలను శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. అలాగే అలొవిరా మాస్కు కూడా వెంట్రుకలపై బాగా పనిచేస్తుంది. ఇందులో హైడ్రేటింగ్ చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.  ఇది జుట్టుపాయలను సిల్కీగా, మరింత మ్రుదువుగా చేస్తుంది. మెత్తగా చేసిన అలొవిరా జెల్ ను రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని మాడుకు రాసుకుని 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత నీళ్లతో తలను కడుక్కోవాలి. మూడవ టిప్పు ఏమిటంటే ఆయిల్ మసాజ్, హెయిర్ మాస్కు పెట్టుకున్న తర్వాత జుట్టును జంటిల్ హెర్బల్ షాంపు లేదా మెడికేటెడ్ షాంపుతో రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల తలలో ఉన్న చుండ్రుతోపాటు అధిక నూనె స్రావల సమస్య కూడా పరిష్కారమవుతుంది. మీరు చేయాల్సిందల్లా వ్రుత్తాకారంలో వేళ్లతో మాడుపై సున్నితంగా మసాజ్ చేయాలి. జుట్టులో పేరుకున్న మురికి, అధిక నూనె స్రావాలు పోవాలంటే వారానికి రెండుసార్లు షాంపుతో తలస్నానం చేయాలి. మరవకుండా చేయాల్సిన మరో విషయం ఏమిటంటే తలకు షాంపు పెట్టుకున్న తర్వాత మాయిశ్చరైజింగ్, నౌరిషింగ్ కండిషనర్ ని వెంట్రుకలకు అప్లై చేసుకోవాలి. దీన్ని మాడుకు కాకుండా కేవలం జుట్టు పాయలకు మాత్రమే అప్లై చేయాలి.  ఆ తర్వాత పది నిమిషాలు దాన్ని అలాగే వదిలేసి ఆ తర్వాత వెంట్రుకలను నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. మీరు తలస్నానం చేసినపుడల్లా ఇలా తప్పనిసరిగా చేయాలి. ఇందుకోసం డీప్ కండిషనింగ్ గల ఇంటి మాస్కును కూడా వారానికి ఒకసారి అప్లై చేసుకోవాలి.

తేనె, పాలు రెండింటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుపై అప్లై చేసి 20 నిమిషాలు అలాగే వదిలేయాలి. జుట్టు సంరక్షణకు షవర్ క్యాప్ పెట్టుకోవడం మరవొద్దు. తర్వాత మైల్డ్ షాంపుతో మీ జుట్టును శుభ్రం చేసుకొని ఆతర్వాత జుట్టుకు కండిషర్ ని పెట్టుకోవాలి. జుట్టు రాలిపోకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇంకొకటి పొడి తువ్వాలుతో వెంట్రుకలను మెల్లగా తుడుచుకోవడం. టవల్ ని తలకు చుట్టుకుంటే తువ్వాలు తలలోని నీటిని పీల్చుకుంటుంది. ఆ తర్వాత మెల్లగా తువ్వాలుతో వెంట్రుకలను రుద్దుతూ తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బాగా ఆరతాయి. ఒకవేళ టైము లేక తొందరగా బయటకు వెళ్లాల్సి ఉంటే మోడరేట్ హీట్ పెట్టుకుని హెయిర్ డ్రయ్యర్ తో వెంట్రుకలను ఆరబెట్టుకోవాలి. అయితే తరచూ బ్లో డ్రయ్యర్స్ వాడితే వెంట్రుకలు దెబ్బతింటాయి కాబట్టి వాటి వినియోగానికి దూరంగా ఉంటే మంచిది. తర్వాత ఆరిన జుట్టును వెడల్పాటి పళ్లున్న వెదురు దువ్వెన్నతో జుట్టు చిక్కుపడకుండా మెల్లగా దువ్వాలి. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే తడి జుట్టును బ్రషింగ్ చేయకూడదు. కారణం తడి వెంట్రుకలు బలంగా ఉండవు. సో…ఇవి  గుర్తుంచుకుని హెయిర్ కేర్ పాటిస్తే మీ జుట్టు రాలదు. అంతేకాదు ఎంతో అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News