Saturday, September 21, 2024
Homeనేరాలు-ఘోరాలుShadnagar: బస్సులో వర్షం! పల్లెవెలుగు బస్సా మజాకా

Shadnagar: బస్సులో వర్షం! పల్లెవెలుగు బస్సా మజాకా

ఈ బస్సులో ప్రయాణించాలంటే గొడుగు తప్పనిసరి

పేద మద్య తరగతి ప్రజలకు రవాణా రంగంలో ఎంతో కాలంగా చేదోడుగా ఉంటూ ఆర్టీసీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ ఖర్చుతో గమ్యస్థానంకు చేర్చుతూ సామాన్య ప్రజానీకానికి చేరువైన ఆర్టీసీ ప్రస్తుతం సరైన నిర్వహణ లేక అభాసుపాలవుతూనే ఉంది. ఇది ఎంతలా అంటే కొన్ని దృశ్యాలు చూస్తే నవ్వుకోవడమే మన వంతవుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు. వర్షాకాలం ప్రారంభమైందంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అంత ఆషామాషీ కాదని,పైసలు పెట్టి మరీ పాపం కొని తెచ్చుకున్నట్లుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీసీ డిపో బస్సుల నిర్వహణ లోపం కారణంగా ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు షాద్ నగర్ నుండి హైదరాబాద్ బయలుదేరిన (ఎపీ28జెడ్6083) పల్లె వెలుగు బస్సులో ప్రయాణించిన వారి పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనకమానరు. బయట వర్షం కురుస్తుండటంతో బస్సులో ప్రయాణం చేసి కాసేపైనా వానకు తడవకుండా ఉంటామని భావించిన ప్రయాణికులకు బస్సులో ఉన్నా వర్షం బాధ తప్పలేదు. పల్లె వెలుగు బస్సుల నిర్వహణ సరిగ్గా లేక వానకు బస్సు పూర్తిగా కురిసింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న గొడుగులను తెరచి సీట్లలో కూర్చోవడం చూసిన వారికి వింతగా కనిపించింది. టికెట్ ధరలను పెంచుతున్న ఆర్టీసీ ప్రజల సౌకర్యాలు మాత్రం పట్టించుకోవడంలో మరీ ఇంత నిర్లక్ష్యమా అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News