Friday, November 22, 2024
HomeతెలంగాణMulugu: గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

Mulugu: గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

ముంపు ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు ముందస్తుగా ఆసుపత్రులకు

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు గ్రామాల్లోని గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య జిల్లాలోని వైద్య సిబ్బందిని ఆదేశించారు. లోతట్టు గ్రామాల్లో గర్భిణీ స్త్రీలను అత్యవసర సమయాలలో కాన్పుల కోసం ఆసుపత్రులకు తరలించాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని, గర్భిణీ స్త్రీలకు ప్రమాదమని అన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గర్భిణీ స్త్రీలను ప్రభుత్వ ఆసుపత్రిలోకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారని, దీంతో తాము తాడువాయి మండలంలోని బంధాల పరిసర ప్రాంతమైన అల్లిగూడెం గ్రామానికి చెందిన సాంబలక్ష్మి, అనూషలను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా గురువారం సాంబశివ ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. గైనకాలజిస్ట్ డాక్టర్ రఘుతో కలిసి వారిని పరీక్షించగా తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. జిల్లాలోని మిగతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా గర్భిణీ స్త్రీలను ఆసుపత్రులకు తరలించాలని వైద్య అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News