ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరూ సురక్షంగా ఉన్నారని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని తెలుపుతూ మార్కాపురం నుండి ఇచ్చాపురం వరకు 4,200 కిలోమీటర్లు పాదయాత్రను చేస్తున్నట్టు జిలాని భాష తెలిపారు. ఇటీవల మార్కాపురంలో నిర్వహించిన సమావేశానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుమతితో ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమ యాత్ర పేరుతో జిలాని చేస్తున్న పాదయాత్ర 9వ రోజుకు బనగానపల్లెకు చేరుకోగా 183 కిలోమీటర్లు పూర్తయినట్లు తెలిపారు. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసానితో కలిసి నందవరం మీదుగా పాణ్యం బయలుదేరారు. మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ ఊళ్లో ప్రజలను అడిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన స్పందన వస్తుందని, రైతులకు మేలు జరుగుతుందని చెప్తున్నారని అన్నారు.
Jagan Fan Padayatra: మార్కాపురం-ఇచ్చాపురం వరకు జగన్ అభిమాని పాదయాత్ర
4,200 km ప్రజా సంక్షేమ యాత్ర చేస్తున్న జగన్ ఫ్యాన్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES