కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ అధ్వర్యంలో ఘనంగా కేటీఆర్
పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే పిలుపుతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కుత్బుల్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు 1000 నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. దివ్యాంగులకు 100 చేతి కర్రలు, వికలాంగులకు 500 దుప్పట్లు పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ క్యాంప్ కార్యాలయం లో బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ బి విజయ శేఖర్ గౌడ్ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకుల, మహిళా కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి ముఖ్య కారణం కేటీఆర్ ని గుర్తు చేశారు, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఐటీ రంగంలోనే కాకుండా హైదరాబాద్ నగరంలో ఎన్నో ఫ్లై ఓవర్లు, నిర్మించి ప్రజలకు మరింత సుపరి పాలనా అందించారు. కేటీఆర్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరేన్నోజరుపుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేనంద కోరుకున్నారు.