Saturday, September 21, 2024
Homeనేరాలు-ఘోరాలుKurnool: కలెక్టరేట్ ముందు సర్పంచుల అర్థనగ్న ప్రదర్శన

Kurnool: కలెక్టరేట్ ముందు సర్పంచుల అర్థనగ్న ప్రదర్శన

మమ్మల్ని ఉత్సవ విగ్రహాలు చేయద్దంటున్న సర్పంచులు

రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని గ్రామాలలో కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేకపోతున్నామని కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సర్పంచులు అర్ధ నగ్న ప్రదర్శనతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో వాలంటీర్లు గ్రామ సచివాలయ గృహ సారధులను సచివాలయ కన్వీనర్ లను ప్రవేశపెట్టి మా సర్పంచుల యొక్క హక్కులు, అధికారాలు, విధులు, బాధ్యతలను హైజాక్ చేశారన్నారు.

- Advertisement -

మహాత్మా గాంధీ ప్రకటించిన గ్రామ స్వరాజ్య సాధన కోసం మమ్ములను నమ్మి ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని రాష్ట్రంలోని 12,918 మంది సర్పంచుల ఆవేదన అన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమం చేపడుతున్న వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని అందుకే మా సర్పంచ్ల సంఘం, పంచాయతీరాజ్ చాంబర్లు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించామని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద మా న్యాయమైన 15 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అనంతరం కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కే శ్రీనివాసులు, బిర్రు ప్రతాపరెడ్డి, భూమా వెంకట వేణుగోపాల్ రెడ్డి, వై రామచంద్రుడు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News