ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల జులై 31న మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినేట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కేబినెట్ భేటీలో ముఖ్యమైన పలు అంశాలతోపాటు, వర్షాలపై కూడా చర్చ జరుగనుంది.
ఇక అసెంబ్లీ సమావేశాల్లో సర్కారును ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు సన్నద్ధంగా ఉన్నాయి. పాదయాత్రతో వచ్చిన కొత్త హుషారుతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాల్లో చురుకైన పాత్రను పోషించేందుకు రెడీగా ఉంది. దీంతో ఈ వర్షాకాల సమావేశాలు వాడి వేడిగా ప్రారంభం కావటం ఖాయంగా మారింది.