Sunday, October 6, 2024
HomeతెలంగాణGangula: పద్మశాలీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వ కృషి

Gangula: పద్మశాలీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వ కృషి

మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా

పధ్మశాలీల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పద్మశాలి కళ్యాణ మండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏసి డైనింగ్ హాల్ ను మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నాకు హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టడంలో పద్మశాలిలో పాత్ర మరువలేనిదన్నారు . అందుకే నేను చేపట్టిన బ్రహ్మత్సవాల్లో అమ్మవారికి సారే పెట్టే అవకాశాన్ని కల్పించాన్నారు. అంతే కాకుండా టిటిడి టెంపుల్ శంకుస్తాపన సమయంలోనూ పద్మశాలీలకు పెద్ద పీఠ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. స్వతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాల్లో బీసీలు వెనక్కి నెట్టి వేయబడ్డారన్నారు. గత పాలకులకు వెనుకబడిన వర్గాలకు విద్యనందించాలనే మనస్సు రాలేదన్నారు. కానీ స్వయం పాలనలో మన బిడ్డలను గొప్పగా చదివించేందుకు సిఎం కెసిఆర్ పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో కరీంనగర్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. గత 10 సంవత్సరాల్లో కరీంనగర్ రూపురేఖాలు మార్చానని… రాబోయే రోజుల్లో కరీంనగరాన్ని మరింత అభివృద్ది చేస్తానని చెప్పారు. హస్టల్ నిర్మాణం కోసం కావల్సిన 40 లక్షల రూపాయలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటానని… నా గెలుపుకోసం దోహద పడ్డ పద్మశాలి బిడ్డలు ఏది అడిగినా లేదు, అనకుండా లేదు కాదు అనకుండా అండగా నిలబడుతానని హామి ఇచ్చారు. మరోసారి తనను ఆశీర్వదిస్తే మరింత అబివృద్ది చేసి చూపిస్తానని వెల్లడించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు స్వర్గం మల్లేశం, దూడం లక్ష్మీరాజ్యం మెతుకు సత్యం వాసాల రమేష్, ఎలక్ట్రిసిటీ ఎస్సీ గంగాధర్ స్వర్గం నరసయ్య వేముల చంద్రశేఖర్ గడ్డం శ్రీరాములు కార్పొరేటర్లు జంగిలి సాగర్ లెక్కల స్వప్న వేణుగోపాల్ భూమా గౌడ్ దిండిగాల మహేష్ తుల బాలయ్య ఏవి రమణ, వొడ్నాల రాజు పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News