Sunday, October 6, 2024
HomeఆటSingareni: ఎన్ఎండీసీ క్రికెట్ ట్రోఫీ ఫైన‌ల్లో సింగ‌రేణి

Singareni: ఎన్ఎండీసీ క్రికెట్ ట్రోఫీ ఫైన‌ల్లో సింగ‌రేణి

ఆగ‌స్టు 6న భెల్ తో ఫైన‌ల్ మ్యాచ్

ఎన్ఎండీసీ క్రికెట్ ట్రోఫీ ఫైన‌ల్లో సింగ‌రేణి సెమీ ఫైన‌ల్ లో హెచ్ఏఎల్ పై 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ టోర్నీలో ఓట‌మి లేని జ‌ట్టుగా రికార్డు సృష్టించింది. హైద‌రాబాద్ లో ఎనిమిది ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు త‌ల‌ప‌డుతున్న ప్ర‌తిష్టాత్మ‌క ఎన్ఎండీసీ క్రికెట్ టోర్నీలో సింగ‌రేణి కాల‌రీస్ జ‌ట్టు అద్భుత‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తూ ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం హైద‌రాబాద్ లోని విజ‌య్ ఆనంద్ క్రీడా మైదానంలో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్ లో సింగ‌రేణి జ‌ట్టు హిందుస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ హెచ్.ఏ.ఎల్‌ జ‌ట్టుతో త‌ల‌ప‌డింది. మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హెచ్.ఏ.ఎల్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లలో 9 వికెట్ల న‌ష్టానికి 108 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లింది.
హెచ్.ఏ.ఎల్ జ‌ట్టులో ఓపెన‌ర్ సందీప్ కుమార్ అత్య‌ధికంగా 48 ప‌రుగులు చేశాడు. సింగ‌రేణి జ‌ట్టు బౌలర్స్ జ‌గ‌దీష్‌ రెండు వికెట్లు, మ‌హేశ్‌ రెండు వికెట్లు, హ‌రికిష‌న్ ఒక వికెట్‌ లు క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ చేసి హెచ్.ఏ.ఎల్ జ‌ట్టును త‌క్కువ స్క్రోర్‌కు ప‌రిమితమ‌య్యేలా చేయ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. 109 ప‌రుగుల ల‌క్ష్య సాధ‌న‌తో బ‌రిలో దిగిన సింగ‌రేణి జ‌ట్టు ఓపెన‌ర్లు శ‌శికాంత్‌, డేవిడ్ రిచ‌ర్డ్స్ దూకుడుగా బ్యాటింగ్ చేశారు.
ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ‌టమే కాకుండా తొలి వికెట్‌కు కేవ‌లం 9 ఓవ‌ర్ల‌లో 76 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేశారు. 47 ప‌రుగుల వ‌ద్ద డేవిడ్ రిచ‌ర్డ్స్ అవుట్ అయ్యాక‌.. జ‌ట్టు కెప్టెన్ శ‌శికాంత్ నిల‌క‌డ‌గా ఆడుతూ జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. డేవిడ్ రిచ‌ర్డ్స్ ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక‌య్యాడు. ఈ టోర్నీలో సింగ‌రేణి జ‌ట్టు లీగ్ ద‌శ‌లో తాను ఆడిన ఈసీఐఎల్‌, మిధానీ, ఎన్ఆర్ఎస్ఈ జ‌ట్ల‌ను ఓడించి ఓటమి లేని జ‌ట్టుగా నిలిచింది. ఆగ‌స్టు 6వ తేదీన‌ ఆదివారం రోజు ఫైన‌ల్ మ్యాచ్ భెల్ తో ఆడ‌నుందని సంస్థ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News