Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్TDP-BJP-Janasena: గంటా, బోండా, కన్నా భేటీ వెనుక ఆంతర్యమిదేనా?

TDP-BJP-Janasena: గంటా, బోండా, కన్నా భేటీ వెనుక ఆంతర్యమిదేనా?

TDP-BJP-Janasena: ఏపీలో ఇంకా ఎన్నికలకు ఒకటిన్నర ఏడాది సమయం ఉండగానే ఇక్కడ రాజకీయాలు శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి. నిర్ణయాలు, ప్రకటనలకు సమయం పడుతుందేమో కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం ఏపీ రాజకీయాలను సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. తాజాగా ఏపీ రాజకీయాల్లో కాపు నాయకుల సమావేశాలు ఆసక్తికరంగా మారింది. వివిధ పార్టీల నేతలతో కాపు నేతల వరుస సమావేశాలు కొత్త ఆలోచనలకు తెరలేపుతున్నాయి.

- Advertisement -

మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. ఇది రాజకీయం కాదని వాళ్ళు చెప్పినా.. ఈ భేటీలో పలు రాజకీయ విషయాలను చర్చించారని తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందు కన్నా లక్ష్మీనారాయణ జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తో భేటీ అవ్వడం ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంకా, చెప్పాలంటే ఈ భేటీ ఇక్కడ అన్ని పార్టీలలో సస్పెన్స్ క్రియేట్ చేసింది.

గత కొద్దిరోజులుగా కన్నా లక్ష్మీనారాయణ, గంటా శ్రీనివాసరావులు పార్టీ మారతారనే వార్తలు వినిపిస్తున్నాయి. బొండాల ఉమా టీడీపీలో ఉన్నా గతంలో ఉన్న స్పీడ్ లేదు. టీడీపీ అధిష్టానం మీద కొంత అసంతృప్తిలో ఉన్న బోండా, ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనుకుంటున్న కన్నా, గంటాలను కలవడం ఆసక్తిగా మారింది. అయితే, ఇది ఆత్మీయ సమావేశమే తప్ప రాజకీయ సమావేశం కాదని ముగ్గురు నేతలు గట్టిగా చెప్తున్న సంగతి తెలిసిందే.

ఏపీలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు టీడీపీని, చంద్రబాబును బద్ద శత్రువుగా చూస్తారు. అందుకే, ఇక్కడ టీడీపీ-బీజేపీ పొత్తు పొసగడం లేదన్న వాదన వినిపిస్తుంది. మరి, మాజీ అధ్యక్షుడు కన్నా ఇద్దరు టీడీపీ నేతలతో సమావేశమై ఏమి చర్చించారు? ఈ సమావేశం కారణం వెనక రెండు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న గంటా, బోండాలతో కలిసి కన్నా జనసేనలో చేరడం.. లేదా టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుకు తగిన కార్యాచరణ రూపొందించడం.

జనసేనాని టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నారు.. అదే మాట పరోక్షంగా చాలాసార్లు చెప్పారు. అయితే, జనసేన ఇప్పటికే బీజేపీతో కలిసి నడుస్తుంది. కానీ, బీజేపీ ఇప్పుడు టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా లేదు. దీంతో ఈ గ్యాప్ ఫిల్ చేస్తే ఆల్ హ్యాపీస్ అన్నట్లే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడం గ్యారంటీ. లేదంటే, సామజిక వర్గాల బేరీజు ప్రకారం జనసేనలో చేరి అక్కడ గెలిచి ఎన్నికల అనంతరం ప్రభుత్వంలో కలిసి పోవడం.. ఈ రెండు అంశాలపై ఈ ముగ్గురు పొలిటికల్ ఎజెండా సాగినట్టు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News