వైయస్సార్ సంపూర్ణ పోషణ అనునది సంక్షేమ కార్యక్రమంలో భాగంగా మహిళల అభివృద్ధి శిశు సంక్షేమమే ధ్యేయంగా పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలకు వారి పోషకాహార అవసరాలను తీర్చడానికి పౌష్టిక ఆహారం అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 7, 2020 న వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు ఎమ్మెల్యే తోగూర్ అర్థర్. వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఐసిడిఎస్ కార్యాలయ ఆవరణలో సిపిడిఓ కోటేశ్వరమ్మ అధ్యక్షతన బాలింత మహిళలకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తోగుర్ ఆర్థర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని బలహీన వర్గాల్లో పోషకాహార లోపాన్ని నివారణకై ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం వైయస్సార్ సంపూర్ణ పోషణ చేపడతామన్నారు.
దీని వల్ల రాష్ట్రంలో 30.16 లక్షలైతే, నియోజవర్గంలో 3900 మంది పిల్లల, పాలిచ్చే తల్లులకు లబ్ధి, చేకూరుతుందన్న విషయాన్ని వెల్లడించారు. గర్భిణీ, పాలిచ్చే తల్లులలో పోషకాహార లోపం మరియు రక్తహీనతపై దృష్టి దృష్టి పెడుతూ అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తామన్నారు. ఈ తరణంలోనే కొందరు బాలింత మహిళలు కేంద్రాలకు రావడం ఇబ్బంది పడుతుండడం వల్ల వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇంటి వద్దకే వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను చేరవేస్తామన్నారు. సంపూర్ణ పోషణ అందించేందుకు బాలింత మహిళలు-చిన్నారులపై సీఎం జగనన్న చూపుతున్న ప్రేమ గర్వించదగినదన్నారు. అలాంటి మంచి మనసున్న ప్రజానాయకుడు జననేత సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తల్లుల ఆశీస్సులతోపాటు చిన్నారుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల ను గర్భిణి మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అకాడమీ డైరెక్టర్ సుకూర్మియా, సింగిల్ విండో చైర్మన్ సగినేలా ఉషనయ్య ,కౌన్సిలర్ ఉండవల్లి ధర్మారెడ్డి, వైసీపీ మహిళ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ, శాతనకోట వైసిపి నాయకులు, ఆర్ట్ శీను వెంకట్, నాయకులు మహేష్, ఎసి డి పి ఓ , ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్లు, మహిళా లబ్ధిదారులు, మరి వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Thoguru Arthur: పోషకాహార లోప నివారణకై ‘వైయస్సార్ సంపూర్ణ పోషణ’
సీఎం జగనన్న చూపుతున్న ప్రేమ గర్వించదగినది
సంబంధిత వార్తలు | RELATED ARTICLES