విద్య లేని వాడు వింత పశువు ఒకప్పటి మాట ఆన్‌లైన్‌లో లేని వాడు అడవి మనిషితో సమానం ఇప్పటి మాట .. అన్ని బాగానే ఉన్న ఇప్పటికి సంపూర్ణ విద్యను సాధించలేదనే చింత ఉండనే ఉంది. డిజిటల్ మార్కెట్ ఒకవైపు దూసుకుపోతున్న ఉన్న ఆన్‌లైన్ సాధ నాలు అసలు కన్నా అనివార్యమైన కార్యకలపాలకే ఎక్కువగా వాడుతున్నారనేది సర్వే. స్మార్ట్‌ఫోన్ల లభ్యత పెరిగిపోతూ ఉంది. ఇప్పటకే చాల ఫీచర్స్ ఉన్న మొబైల్స్ ఉన్న దానికన్నా కాస్త తక్కువ ధరకే ఉంటున్నాయని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై వినియోగదారుల ప్రభావం ఉంది. బ్లూమ్‌బర్గ్ వెలువరించిన ఓ కథనం ప్రకారం ప్రతి వ్యక్తి ఒకటి కంటే ఎక్కువగానే స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్నారు. ఒక్కో వ్యక్తి ఒకటి కంటే ఎక్కువగానే ఫోన్లు వాడుతున్నారు. 2024లో స్మార్ట్‌ఫోన్ల అవసరాలు పెరిగి మరింత ప్రియం కానున్నాయని పేర్కొంది. అయితే అరచేతిలో ఆన్‌లైన్ ప్రపంచం కనబడుతుంటే స్కిల్ సెట్‌లో నేర్చుకునే పద్ధతుల్లో మనవాళ్ళు వెనుకనే ఉన్నారని చెప్పొచ్చు అందుకు గల కారణాలను వివరించి విద్యకు సంబంధించిన పుస్తకాల కోసం యువత ఇక గ్రంథాలయాల చుట్టూ, బుక్ షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్‌లోనే సమస్త సమాచారం తెలుసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం.. నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్డీఎల్‌ఐ) యాప్ రూపంలో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అత్యంత ప్రామాణిక కంటెంట్ ఉంటుంది. టెక్నాలజీ, సైన్స్, హ్యుమానిటీస్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ వంటి సబ్జెక్టుల్లో నిష్ణాతులైన కంటెంట్ హోస్టులు, 100కి పైగా అభ్యసన సాధనాలు, 90 లక్షల మంది అందించిన 47 లక్షల ఆర్టికల్స్, దాదాపు 70 లక్షల పుస్త కాలు.. ఇవీ స్థూలంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్డీఎల్‌ఐ) ప్రత్యేకతలు. https://ndl.iitkgp. ac.in/ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలుంటాయి. గత ప్రశ్నా పత్రాలు, వ్యవసాయం, చరిత్ర, టెక్నాలజీ, కంప్యూటర్, సైన్స్, సోషియలాజీ, ఆంత్రోపాలజీ, విద్య పరిశోధన, భౌతికశాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తదితర పుస్తకాలు ఈ యాప్ ఆధారంగా చదువుకోవచ్చు. ఇంటర్నెట్ ఉంటే చాలు ఏదో ఒకచోట కూర్చొని అవసరమైన పుస్తకాలను చదువుకోవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు. జాతీయ విద్యా మిషన్‌లో భాగంగా జాతీయ డిజిటల్ లైబ్రరీని రూపొందించింది. అన్నిరకాల పుస్తకాలను డిజిటలైజ్ చేసి ఇందులో అందుబాటులో ఉంచింది. వీడియో పాఠాలను సైతం ఉచితంగా అందిస్తోంది. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన మెటీరియల్ కూడా ఇందులో ఉంచింది. నేషనల్ డిజిటల్ లైబ్రరీలో పుస్తకాలు ఉచితంగా చదివేందుకు ముందుగా లాగిన్ కావాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా ఆన్‌లైన్‌లో ఎన్డీఎల్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. మెయిల్ ఐడీ ద్వారా కూడా రిజిష్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఏయే పుస్తకాలు కావాలి. ఏ విద్యాసంస్థలో చదువుతున్నారు.. వంటి పూర్తి వివరాలు అందులో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి రిజిష్టర్ అయిన తర్వాత ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా చదువుకోవచ్చు. తరగతి గది పాటలకు స్వస్తి పలికి అరచేతిలో ప్రపంచ విద్యను ఏ మూలనుంచైన ఆస్వాదించే వెసులుబాటు అన్ని కోర్స్‌లను ఆన్‌లైన్‌లోనే అందించటానికి 2016లోనే కేంద్ర ప్రభుత్వం ఐఐటిఎన్‌ఐటిలతో ఓ సామూహిక ఆన్‌లైన్ కోర్సుల సిస్టం నియమాలు చేసింది. అది మూక్స్ (మస్సివె ఆన్‌లైన్ కోర్సెస్) ద్వారా ఏ కోర్స్ నిన్న రిజిస్టర్ చేసుకొని సర్టిఫైడ్ సర్టిఫికెట్‌ని పొందవచ్చు. అదే విధముగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగ చేపట్టిన టి -షాట్ ద్వారా అన్ని పోటీ పరీక్షలకు ఉచితముగా అనుభవగ్నులైన అధ్యా పకుల ద్వారా పాటలు బోధిస్తుంది.
ప్రతిష్టాత్మక ముంబయి యూనివర్సిటీ ఆధునిక పోకడలకు తగినట్టుగా తనను తాను మలచుకుంటోంది. తాజాగా ఈ యూనివర్సిటీ తన సామాజిక మీడియా ఖాతాలను తెరిచింది. ఈ ఖాతాల ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా తోడ్పాటునందించాలని యూనివర్సిటీ యోచిస్తోంది. ఇప్పటికే ఈ యూనివర్సిటీకి ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది. కొంతకాలం క్రితం దాన్ని ప్రారంభించారు. ఆ అప్లి కేషనును ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే పెద్ద సంఖ్యలో విద్యార్థులు దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. అది విజయవంతం కావడంతో ఇపుడు ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలను ప్రారంభించారు. ఈ ఖాతాల ద్వారా విద్యార్థులు తమ తమ తరగతులను వీడియో ఫార్మాట్లో వీక్షించవచ్చు. దాంతో పాటు యూనివర్సిటీకి సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ కోవలోనే అన్ని యూనివర్సిటీలు నడవాలని విద్యార్థులు అందోళన చేస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆన్‌లైన్ విద్యకు భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ‘స్వయం’ ఆన్‌లైన్ వేదిక ప్రవేశాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. స్వయంతో పాటు అనేక ఆన్‌లైన్ వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నట్లు యూజీసీ ప్రకటించింది. ఆ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేళ పాఠశాలలను సైతం మూసివేశారు. దీంతో కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నడిచే ‘స్వయం’ ఆన్‌లైన్ కోర్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. జాతీయస్థాయిలో ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు’ (మూక్స్) తరహాలో కేంద్ర ప్రభుత్వం ‘స్వయం’ పేరిట ఒక ఆన్‌లైన్ వేదికను అందుబాటులోకి తెచ్చింది. అందులో దాదాపు 1900 కోర్సులున్నాయి.
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యూజీసీ వాటి ఇంటర్ యూనివర్సిటీ సెంటర్స్ (ఐయూ సీలు)లు.. ఇన్ఫర్మేషన్, లైబ్రరీ నెట్‌వర్క్, కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్(సీఈసీ) వంటి ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ)ని అభివృద్ధి చేశాయి. ఇవి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు అందరికీ ఉపయోగపడతాయి. ఉదాహరణకు మరికొన్ని ఆన్‌లైన్ వేదికలు 1.స్వయం ఆన్‌లైన్ – https://swayam. gov.in 2.యూజీ, పీజీ మూక్స్: http://ugcmoocs. inflibnet.ac.in 3.ఈ-పీజీ పాఠశాల: https://epgp. inflibnet.ac.in 4.ఈ-కంటెంట్ కోర్స్‌వేర్ ఇన్ యూజీ సబ్జెక్ట్: http://cec.nic.in 5.స్వయంప్రభ: https:// swayamprabha.gov.in 6.సీఈసీ-యూజీసీ యూ ట్యూబ్ ఛానల్: https://www.youtube.com/user/ cecedusat వీటితోపాటు నేషనల్ డిజిటల్ లైబ్రరీ, ఇండియన్ ఎలక్ట్రానిక్ థీసెస్, డిసర్టేషన్స్ కోసం షోద్‌గంగ, వివిధ జర్నల్స్ కోసం ఈ-షోద్ సింధు, డేటాబేస్ నిపు ణులు ఇచ్చే సమాచారం కోసం విద్వాన్ వంటి వెబ్‌సైట్లు ఉన్నాయని యూజీసీ తెలిపింది. ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. దీంతో ఇప్పుడు పట్టణాల్లో కన్నా గ్రామాల్లోనే ఇంటర్నెట్ యూజర్లు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఇంటర్నెట్ వాడే వారిలో మహి ళల సంఖ్య ఎక్కువగా పెరుగుతూ వస్తోంది. ఆన్‌లైన్‌లో కోడింగ్ పై శిక్షణ ఇచ్చే సంస్థలు అనేకం ఉన్నాయి. కోవిడ్ సమయంలో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న విద్యార్థులు, నిరు ద్యోగులు కోడింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. శిక్షణా సంస్థల కోసం ఆన్‌లైన్‌లో శోధిస్తున్నారు. మందికి స్కిల్స్ లేకపోవడంతోనే నిరుద్యోగులుగా మారుతున్నారు. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటే భవిష్యత్ ఫలాలు అందుకోగలుగుతాం.
ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పట్టణాల్లో కన్నా పల్లెటూర్లలో ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసో సియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ), నీల్సన్ తాజా నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2022 నవంబర్ నాటికి చూస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 42.7 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లతో పోలిస్తే ఈ సంఖ్య 10 శాతం ఎక్కువ. పట్టణాల్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 20.5 కోట్లుగా ఉంది. ఇకపోతే ఐఏఎంఏఐ నివేదిక ప్రకా రం.. భారత్‌లో మహిళా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య బాగా పెరిగిందియితే మరో పక్క ఇంటర్నెట్ సమస్య చాల గారంగ్రామాల్లో లేదు భారతదేశంలో మొత్తం మొబైల్ వినియోగదారులు 116.3 కోట్లకు చేరవచ్చు, కాని భారత దేశంలోని 5.97 లక్షల గ్రామాలలో 25,000 గ్రామాలకు ఇప్పటికీ మొబైల్ లేదా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. ఇండి యాలో 24 కోట్లమంది విద్యార్ధులుండగా, వారిలో 18,188 మందిపై సర్వే నిర్వహించగా 80 శాతం మంది పిల్లలకు ల్యాప్‌టాప్‌లు అందుబాటులో లేవని, 20 శాతం మందికి స్మార్ట్‌ఫోన్ అందుబాటులో లేదని తేలింది. వామ పక్ష తీవ్రవాద ప్రభావిత 11 రాష్ట్రాల్లోని 90 జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని గ్రామాలు 10,000కు పైగా ఉన్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో సాటిలైట్ ద్వారా విద్యాబోధన జరగాలని ప్రజల ఆకాంక్షానాణ్యమైన ఇంట ర్నెట్, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లాంటి సదుపాయలు లేకపో వడం వల్ల చాలామంది పిల్లలు చదువులకు దూరమవుతు న్నారని ఒక సర్వేలో తేలింది. ఇండియాలో 24 కోట్లమంది విద్యార్ధులుండగా, వారిలో 18,188 మందిపై సర్వే నిర్వ హించగా 80 శాతం మంది పిల్లలకు ల్యాప్‌టాప్‌లు అం దుబాటులో లేవని, 20 శాతం మందికి స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేదని తేలింది. ఆన్‌లైన్ విద్య తప్పనిసరైన ఈ పరిస్థితుల్లో విద్యాహక్కు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఉన్నవారికే పరిమితమైంది. డిజిటల్ గాడ్జెట్‌లు లేనివారు ఆన్‌లైన్ పాఠశాలలకు దూరమవుతున్నారు. అందుకే ప్రభు త్వాలు ఈ విఫలత్వాన్ని పసిగట్టి ముందు చర్యలకు ఉప క్రమించాలి లేకపోతే ఆన్‌లైన్ విద్య అంత మిథ్యే. సమా న్యుణ్ణి సైతం సాహసిగా మార్చేది విద్యే.
డాక్టర్ కృష్ణ సామల్ల
ప్రొఫెసర్ & ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్
- 9705890045