Sunday, October 6, 2024
HomeతెలంగాణJanvada: ఆరోగ్య రథం ప్రారంభం

Janvada: ఆరోగ్య రథం ప్రారంభం

ఆరోగ్య సేవలన్నీ ఈ రథం ద్వారా అందిస్తామంటున్న నేతలు

శంకర్ పల్లి మండల పరిధిలోని జన్వాడ గ్రామంలో ఆరోగ్య రథం కార్యక్రమాన్ని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య ప్రారంభించారు. అనంతరం తెలంగాణ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ కి ఘనంగా నివాళులు అర్పించిన చేవెళ్ల ఎంపీ మరియు ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊత మిచ్చి, ప్రజలకు విముక్తి పాఠాలు నేర్పిన మహోపాధ్యాయులు ఆజన్మంతా కర్మయోగి, తెలంగాణ దిక్సూచి ,స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారికి జయంతి కి నివాళులు అర్పించడం సంతోషదాయకం అన్నారు.

- Advertisement -

అలాగే ఆరోగ్య రధం కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఇతర ప్రాంతాలతో పాటు అన్ని గ్రామాల ప్రజలు ఆరోగ్య రధం కార్యక్రమం ఎటువంటి అంతరాయం లేకుండా దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. ప్రైవేటు హాస్పటల్ లో వేలకు వేలు డబ్బులు ఖర్చవుతున్న ఈ రోజులలో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రక్తపరీక్షతో పాటు రాబోయే రోజులలో కంటికి సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేశారు.

ఆరోగ్య రధంలో ఉచిత ఆరోగ్య పరీక్షలతో పాటు మందులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని చేవెళ్లలోని పి ఎం ఆర్ ఐ ఎం ఎస్ లో ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి ,శంకర్ పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి ,పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి ,జన్వాడ సర్పంచ్ లలిత నరసింహ , ఎంపిటిసి నాగేందర్, బి ఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మరియు గోపాల్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి ,రాఘవేందర్ రెడ్డి కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News