Friday, November 22, 2024
Homeతెలంగాణఆరోగ్య చేవెళ్లే లక్ష్యంగా ఆరోగ్య రథ సేవలు ప్రారంభం

ఆరోగ్య చేవెళ్లే లక్ష్యంగా ఆరోగ్య రథ సేవలు ప్రారంభం

పేద ప్రజల ఆరోగ్యం కోసమే సొంత డబ్బులతో చేవెళ్ల ఆరోగ్య రథ సేవలు

ఆరోగ్య చేవెళ్లే లక్ష్యంగా ఆరోగ్య రథ సేవలు ప్రారంభించామని, సంజీవని లాంటి చేవెళ్ల ఆరోగ్య రథ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజక వర్గం, నవాబ్ పేట మండలంలోని, ఎక్ మామిడి గ్రామంలో చేవెళ్ల ఆరోగ్య రథ సేవలను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆసుపత్రికి వెళ్లలేని ఎంతో మంది పేద ప్రజల కోసమే తాను ఆరోగ్య చేవెళ్ల రథ సేవలు ప్రారంభించామని తెలిపారు.

- Advertisement -

అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని, పండు ముసలి వరకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నారని వారు గుర్తుచేశారు. దళిత బందు, బీసీ కులాలకు, మైనార్టీలకు ఆర్థిక సాయం కూడా ప్రతి వర్గం సంక్షేమం పట్ల
సీఎం కేసిఆర్ కు ఉన్న చిత్తశుద్ధికి కారణమేనన్నారు. కేసిఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి వర్గం సంతోషంగా ఉందని నొక్కి చెప్పారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. తొమ్మిది ఏండ్ల బీఆర్ఎస్ సర్కార్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామని, కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శిస్తూ.., అందుకే తాము పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పాలన చేతకాదు అన్నోళ్ళ నోర్లు మూహించేలా కేసిఆర్ పాలన సాగుతుందన్నారు. కేసిఆర్ ముందు చూపు వల్లే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ది సాధించిందన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆయన 14 ఏళ్లు అన్ని ప్రాంతాలలో పర్యటించి, ప్రజల బాధలను అర్థం చేసుకుని, నేడు అన్ని వర్గాల ప్రజలు సంతోష పడేలా పాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజ్, 300 బెడ్ లతో ఆసుపత్రి కేసిఆర్ పుణ్యమేనన్నారు. ఆరోగ్యాన్ని అశ్రద్ద చెయ్యడం వల్లే చాలా మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని వేడుకున్నారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ ఎంపీ రంజిత్ రెడ్డి తన సొంత డబ్బులతో చేవెళ్ల ఆరోగ్య రథం పేరిట ప్రతి పల్లెలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎకమామిడి గ్రామంలో 50 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్ మామిడి గ్రామ సర్పంచ్ రఫీ, ఎంపీటిసి శ్రీవాణి, ఎంపీపీ కాలే భవాని, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News