Sunday, September 29, 2024
HomeతెలంగాణChennur: కుల వృత్తులకు ఆర్థిక అండగా కేసీఆర్

Chennur: కుల వృత్తులకు ఆర్థిక అండగా కేసీఆర్

అర్హులందరికీ ఆర్థికంగా అండ దక్కుతుందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే

చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి 300 బీసీ కుల వృత్తుదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ చెక్కుల జిల్లా కేంద్రం నస్పూర్ కలెక్టర్ కార్యాలయ సమావేశ హలులో పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేతుల మీదుగా ఇది సాగింది. దళిత వాడల నుంచి దరిద్రాన్ని తరిమికొట్టే సంకల్పంతో పథకాలు చేపట్టిన, గిరిజనుల జీవితాల్లో ప్రగతి వెలుగులకు పథకాలు రచించినా, బీసీ కుల వృత్తుదారులకు ప్రోత్సాహకాలను అందిస్తూ సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా కుల వృత్తులకు పునరుజ్జీవం పోసేలా పథకాలు తీసుకొచ్చిన బహుజన బాంధవుడు కేసీఆర్. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, చేనేతకు చేయూత, నేతన్నకు బీమా, సెలూన్లకు ఉచిత కరెంట్, దోభీఘాట్ల ఆధునీకరణ, తాళ్ల పన్ను రద్దు, నేత & గీత కార్మికులకు పెన్షన్లు, 5 లక్షల ప్రమాద బీమా వంటి అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వృత్తి పనుల వారికి ప్రత్యేక ప్రోత్సాహాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నది.

- Advertisement -

ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన బీసీలు, చేతి వృత్తిదారులకు ప్రోత్సాహం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వారి ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం అమలు చేస్తున్నారు. తొలి విడతలో భాగంగా నియోజకవర్గానికి 300 చొప్పున రాష్ట్రంలో మొత్తంగా 35,700 మందికి లక్ష రూపాయలు చొప్పున అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నూర్ నియోజకవర్గంలో 3084 మంది అప్లై చేశారు. ఇందులో 2448 మందిని అర్హులుగాఅధికారులు గుర్తించారు. వీరందరికీ విడుదలవారీగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తాం. లబ్ధిదారుల ఎంపిక చాలా పారదర్శకంగా చేశాము. ఇది నిరంతరం కొనసాగే పథకం.విడతల వారిగా అందరికీ అందజేస్తాం. త్వరలోనే రెండవ విడత చెక్కులను అందజేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఈ పథకం విషయంలో ప్రతి పక్షాల తప్పుడు మాటలు చెప్పుడు మాటలు నమ్మకూడదు. రానివారెవరు ఆందోళన చెందవద్దు.

గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల కురుమలకు చేయూతనివ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది. గౌడన్నల సంక్షేమం కోసం చెట్ల రకం బకాయిలు రద్దు చేయడమే కాకుండా తాటి ఈత చెట్లపై పన్ను వేసే పద్ధతికి స్వస్తి పలికింది. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం ఐదు లక్షల పరిహారాన్ని అందిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసుల దశాబ్దలకలను నిజం చేశారు. గత ప్రభుత్వాలు పాలకులు ఎవరు ఈ జిల్లాను పట్టించుకోలేదు. 60 ఏళ్ల సమైక్య పాలనలో నీళ్లు ఉద్యోగాలు మనకు కాకుండా చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు. 24 గంటల ఉచిత విద్యుత్ విద్యుత్ ఎత్తేసి, ధరణి సైట్ రద్దుచేసి దళారీ వ్యవస్థను తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుంది. 95 సీట్లు సాధించి కెసిఆర్ గారు హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించబోతున్నారు.

తెలంగాణలో అన్ని వర్గాలకు సంక్షేమం అందుతుంది. చిల్లర విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు నాలుగున్నార ఏళ్ళు ఎటు పోయారో ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చెన్నూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. కేసీఆర్ గారి ఆశీస్సులతో తుంతుంగ, సుద్దాల, కిష్టంపేట, గంగారం, రసూల్ పల్లి , బొక్కలగుట్ట, సుబ్బారాం పల్లి బ్రిడ్జిలను పూర్తి చేసాం. 500 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నాం. 4000 సింగరేణి ఇండ్ల పట్టాలు, 1000 కి పైగా పోడు పట్టాలు అందించాం. చెన్నూర్ పట్టణంలో ఏడు కోట్లతో 50 పడకల ప్రభుత్వ హాస్పిటల్ పూర్తి చేసాం. 100 పడకల ప్రభుత్వ దవాఖాన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.1658 కోట్లతో నిర్మించనున్న చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరలోనే ప్రారంభిస్తాము. ముఖ్యమంత్రి కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం మద్దతు దీవెన ఎప్పుడు ఉండాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News