Saturday, November 23, 2024
HomeతెలంగాణMahabubabad: కేసీఆర్ ఫోటోకు సత్యవతి రాథోడ్ పాలాభిషేకం

Mahabubabad: కేసీఆర్ ఫోటోకు సత్యవతి రాథోడ్ పాలాభిషేకం

విద్యా కేంద్రంగా మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్ జిల్లా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన ముఖ్యమంత్రి కు ఈ జిల్లా మీద ప్రత్యేక ప్రేమతో ఇంజనీరింగ్ కాలేజ్ ను మంజూరు ఇచ్చారు. ఈ ఏడాది నుండి విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభించుకుంటున్నామని, ఐదు కోర్సులతో తరగతులకు 60 మంది చొప్పున 300 మందికి అవకాశం కల్పిస్తున్నాం అన్నారు. నూతన ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం ప్రారంభించుకున్నాము. దానికి అనుబంధంగా ఎంబీఏ కోర్సును వారం రోజుల్లో తీసుకొస్తామన్నారు. జిల్లాలో 500 కోట్లతో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ని ఏర్పాటు చేసుకున్నామన్నారు.

- Advertisement -

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మారుమూల ప్రాంతమైన ఎంతో మంది విద్యార్థులు చదువులకు దూరమయ్యారనీ విచారం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితులకు స్వస్తి చెప్పి మానుకోటను జిల్లాగా చేసి విద్యా కేంద్రంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. గతంలో మన జిల్లాలోని విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు జిల్లాలోనే ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించామన్నారు. రాష్ట్రంలో మూడో సారి వచ్చేది కేసీఆర్ సర్కారే అని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు తిరుగులేదు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్థానం లేదు అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మార్కు పాలన కోసగుతుందన్నారు.

రైతులకు, రైతుబంధు, రైతు రుణమాఫీ చేస్తూ రైతులకు అండగా నిలిచారని తెలిపారు మానుకోట అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు కనిపిస్తుందన్నారు. జిల్లాలో 300 పడకల ఆసుపత్రిలో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం అని తెలిపారు. జిల్లా ప్రజలు మన ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆశీర్వదించాలన్నారు. ఈ ర్యాలీలో జడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, ఎంపీ మాలోత్ కవిత, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News