Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: ఎట్టకేలకు కేసి కెనాల్ కు నీరు, ఆనందంలో రైతన్నలు

Nandikotkuru: ఎట్టకేలకు కేసి కెనాల్ కు నీరు, ఆనందంలో రైతన్నలు

అర్థర్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి రైతుల ధన్యవాదాలు

నందికొట్కూర్ నియోజకవర్గంలో కేసీ కెనాల్ నీళ్లపై ఆధారపడి 80 శాతం మంది రైతన్నలు వ్యవసాయ సాగుచేసుకొని జీవనము కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నాటికి రైతన్నల పంటల సాగు కోసం కేసీ కెనాల్ కు జూన్ మాసంలోనే నీళ్లు వదలటం ఆనవాయితీగా కొనసాగుతూ ఉన్నది. అదే ఆశాభావంతో కేసి కెనాల్ ఆయా కట్టు రైతులు అదే నమ్మకంతో పంటలు వేసుకొని ఆగస్టు నెల పూర్తిగా వస్తున్న కేసికి నీరు విడుదల కాకపోవడంతో పంటలు సాగు చేసుకున్న రైతన్నలు పంటలు ఎండిపోవడంపై గత కొన్ని రోజులుగా నియోజవర్గంలో పలు సందర్భాల్లో రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

రైతులకు ఆందోళనకూ మద్దతుగా సిపిఐ, సిపిఎం, టిడిపి పార్టీ మల్యాల పంపు హౌస్ ధర్నా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ నిర్లక్ష్య తీరుపై ధ్వజమెత్తారు. నియోజవర్గానికి చెందిన రైతులు ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద నిరసన కార్యక్రమానికి రైతన్నలు భారీగా చేరుకొని ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సంఘటనల నేపథ్యంలో హంద్రీనీవా లిఫ్టి ఇరిగేషన్ వద్ద, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ఆత్మకూరు డిఎస్పి శ్రీనివాసరావు మల్యాల హంద్రీనీవా లిప్ ఇరిగేషన్ వద్ద సీఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో బంద్ బస్త్ చేపట్టారు. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఆర్థర్ రైతులతో కలిసి మల్యాల పంప్ హౌస్ దగ్గర నిరసన చేపట్టగా, ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులను సంప్రదిస్తూ నిరసన తెలిపారు.

మరోవైపు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వంలో ఆయన వర్గీయులు పుల్యాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ఆందోళనతో నిరసన కార్యక్రమం చేపట్టారు. మల్యాల హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుండి నీళ్లు విడుదల చేసేలా అధికారులపై నియోజవర్గ నేతల ఒత్తిడి నేపథ్యంలో నాటకీయ పరిణామాల నడుమ బుధవారం సాయంత్రం ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు ముచ్చుమర్రి, మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ల గేట్లు ఎత్తివేసి కేసి కెనాల్ కి నీటిని విడుదల చేశారు. దీంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News