చేవెళ్ల మండల కేంద్రంలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ చేశారు. హైదరాబాద్ బీజాపూర్ హైవే ప్రక్కన శంకరపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణకు రాష్ట్ర టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… సర్వాయి పాపన్న గౌడ్ ఆసియా ఖండంలోనే తిరుగులేని వీరుడు అన్నారు. ఆనాడు ఆయన బహుజన సమాజం కోసం పోరాడిన యోధుడన్నారు. రైతు పండించిన పంట కళ్ళల్లో గింజలు ఎత్తుకుపోతే మందుల్లో గొర్రెలు పట్టిన చేపలు చేసిన కుండలు ఉతికిన బట్టలు గీసిన కళ్ళు తాగి పైకం ఇయ్యకపోతే బహుజనుల కోసం కొట్లాడిన వీరుడు అన్నారు. జనగామ ప్రాంతంలో 25 గొలుసు కట్టు చెరువులు తవ్వించిన ఘనత అయినది అన్నారు. రైతుల కోసం గొలుసు కట్టు చెరువులు తవ్వించారన్నారు. భువనగిరి నుంచి వరంగల్ వరకు 33 కోటలను మొగల సామ్రాజ్యం నుంచి స్వాధీనపరుచుకొని చివరకు గోలకొండ కోటను కూడా ఏలిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాపన్న సాక్షిగా ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నాడన్నారు. ట్యాంక్ బండ్ పై విగ్రహం అధికారికంగా ఆయన జయంతి వర్ధంతిలను కోసం ప్రత్యేక జీవో తీసుకురావడం హర్షనీయమన్నారు. నాటి కులవృత్తులే నాగరికతను కాపాడిన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కల్లును నిషేధిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం కల్లును అమృతం అని తాగించిందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తుందని ప్రభుత్వ పథకాలను కొనియాడారు. కెసిఆర్ ప్రభుత్వంలో రైతు రాజ్యం అని దేశంలో చేపలు పెంపకంలో మన రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. 500 కోట్లతో ఆత్మగౌరవ కుల సంఘాల భవనాలు నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను కొనియాడుతున్న సమయంలో బహిరంగ సభలో కొందరు కేసీఆర్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. సంక్షేమ పథకాల కోసం కాదు సర్వాయి పాపన్న గొప్పతనం గూర్చి మాట్లాడమని ఈలలు వేయడంతో శ్రీనివాస్ గౌడ్ కు అవమానం జరిగింది. మంత్రి తేరుకొని ఓకే ఓకే సర్వాయి పాపన్న గొప్పతనం గురించే మాట్లాడుతానని సర్వాయి పాపన్న స్ఫూర్తితో గౌడన్నలు ముందుకు సాగాలని హితవు పలికి ఆయన స్పీచ్ ని విరమించారు.
విగ్రహ ఆవిష్కరణలో బహిరంగ సభలో పాల్గొన్న ప్రజలు సభా ప్రాంగణంలో కనిపించకపోవడంతో సభ అంత బోసిపోయింది. సభా ప్రాంగణంలో జనం లేక ఖాళీ కుర్చీలు దర్శనమిస్తూ… పలుచబడిపోయింది. సంఘం కోసం శ్రమ పడింది ఒకరైతే వేదికపై పెత్తనం చెలాయిస్తుంది మరొకరా..! అంటూ…. అసహనం వ్యక్తం చేసిన సభ నిర్వాహకుల పట్ల అసహనం గౌడన్నలు అసహనం చేశారు. సభ వ్యవహారాలు చూసుకునే వ్యక్తిపై మండిపడుతూ… సభకు వచ్చిన కొందరు గౌడ నేతలు అవమానానికి గురై వాగ్వాదం జరిగింది.
ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ స్థానిక జడ్పిటిసి మరుపల్లి మాలతి కృష్ణారెడ్డి ఎంపీపీ మల్ గారి విజయలక్ష్మి రమణారెడ్డి స్థానిక సర్పంచ్ శైలజ రెడ్డి మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ సమతా వెంకటరెడ్డి వైస్ ఎంపీపీ కర్ణ మాజీ ఎంపీపీ మంగలి బాలరాజు రాజ్యలక్ష్మి ప్రకాష్ గౌడ్ గౌడ సంఘం రాష్ట్ర నాయకులు అంబాల నారాయణ గౌడ్ మూతి చక్రధర్ గౌడ్ పల్లె లక్ష్మణ్ గౌడ్ తాల్ల శ్రీశైలం గౌడ్ శివప్రసాద్ గౌడ సంఘం నాయకులు అశోక్ గౌడ్ నరేందర్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ రాఘవులు గౌడ్ వివిధ పార్టీల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.